మంత్రివర్గ పునఃవ్యవస్థీకరణ తర్వాత .. నేడు కేబినెట్ తొలి భేటీ

మంత్రివర్గ పునఃవ్యవస్థీకరణ తర్వాత .. నేడు కేబినెట్ తొలి భేటీ
మంత్రివర్గ పునఃవ్యవస్థీకరణ తర్వాత తొలిసారి రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాక్లో మద్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ సమావేశం జరుగనుంది.
మంత్రివర్గ పునఃవ్యవస్థీకరణ తర్వాత రాష్ట్ర కేబినెట్ ఇవాళ తొలిసారి సమావేశం కానుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరగనుంది. దేవాదాయశాఖలో 2 లక్షల ఎకరాల ఆక్రమణలకు సంబంధించిన అంశంపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
దిశా చట్టంపై సవరణలకు సంబంధించిన అంశాలను సమీక్షించి కేంద్రానికి పంపుతారని సమాచారం. అమ్మ ఒడి పథకం గడపగడపకూ మన ప్రభుత్వం పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమాలకు సంబంధించి సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: 'గడప గడపకు' నిలదీతలు.. సమస్యలతో జనం స్వాగతం!
