ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పీఎఫ్‌ఐ కేసు.. నిందితుల కస్టడీ కోరిన ఎన్ఐఏ

By

Published : Sep 20, 2022, 7:31 PM IST

NIA ask custody of accused arrested in PFI case: పీఎఫ్‌ఐ కేసులో తెలంగాణలో అరెస్టు చేసిన నిందితుల్ని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కస్టడీకి కోరింది. నలుగురు నిందితుల్ని 30రోజుల కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టుకు ఎన్‌ఐఏ విజ్ఞప్తి చేసింది.

nia
nia

NIA ask custody of accused arrested in PFI case: పీఎఫ్‌ఐ కేసులో తెలంగాణలో అరెస్టు చేసిన నిందితుల్ని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కస్టడీకి కోరింది. నలుగురు నిందితుల్ని 30రోజుల కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టుకు ఎన్‌ఐఏ విజ్ఞప్తి చేసింది. సయ్యద్ సమీర్, ఫిరోజ్ ఖాన్, మహ్మద్ ఉస్మాన్, ఇర్ఫాన్‌లను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. ఈ నలుగురు నిందితులు పీఎఫ్‌ఐ కార్యకర్తలని కోర్టుకు తెలిపింది. వీరిలో అబ్దుల్‌ ఖాదర్‌ను ప్రధాన నిందితుడిగా ఎన్ఐఏ వెల్లడించింది.

ఉగ్రమూలాలు ఉన్నాయనే కోణంలో దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ శిక్షణా కార్యక్రమాలపై నిఘా పెట్టిన అధికారులు... ఆదివారం నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో 38 చోట్ల సోదాలు నిర్వహించిన అధికారులు... పలు చరవాణీలు, పాస్ పోర్టులు, బ్యాంక్ ఖాతా పుస్తకాలు, డైరీలు స్వాధీనం చేసుకుని.. కోర్టుకు తీసుకొచ్చారు. ఎన్ఐఏ అధికారులు ఆదివారం అదుపులోకి తీసుకున్న నలుగురిని సోమవారం హైదరాబాద్ నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. పలు కంప్యూటర్ హార్డ్​డిస్క్​లు, కీలక పత్రాలను కోర్టుకు సమర్పించారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్​ఐ) కేసులో... తెలుగు రాష్ట్రాల్లో 40 చోట్ల అధికారులు ఆదివారం విస్తృత తనిఖీలు నిర్వహించారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details