ఆంధ్రప్రదేశ్

andhra pradesh

9 PM ప్రధాన వార్తలు

By

Published : Aug 13, 2022, 9:03 PM IST

Updated : Aug 13, 2022, 9:32 PM IST

.

9 pm
9 pm

  • ముఖ్యమంత్రి జగన్‌కు తమిళనాడు సీఎం లేఖ
    ముఖ్యమంత్రి జగన్ కు.. తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తూరు పరిధిలో నిర్మించ తలపెట్టిన 2 ప్రాజెక్టులను ఆపాలని ఆ లేఖలో కోరారు. ఆ ప్రాజెక్టులు పూర్తయితే.. చెన్నైకి తాగునీటి సమస్యలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆ రెండు జిల్లాల్లో భూకంపం
    రాష్ట్రంలో రెండు జిల్లాల్లో భూకంపం జనాలను హడలెత్తించింది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భూమి కంపించింది. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, దుత్తలూరు, కొండాపురం మండలాల్లో స్వల్ప ప్రకంపనలు వచ్చాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • గోరంట్ల మాధవ్ వీడియో నిజమైనదేనని చెప్పిన ఫోరెన్సిక్​ రిపోర్ట్​
    Forensic report on MP Gorantla video ఎంపీ గోరంట్ల మాధవ్‌ నగ్న వీడియో నకిలీది కాదని, నిజమైనదేనని అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్‌ నిర్ధరించిందని తెదేపా నేతలు స్పష్టం చేశారు. తెదేపా తరఫున ఈ వీడియోను ప్రైవేటుగా ఫోరెన్సిక్‌ ల్యాబ్ కు పంపామని.. అందులో మార్ఫింగ్‌ జరగలేదని ల్యాబ్‌ నిపుణుడు నివేదిక ఇచ్చినట్లు పార్టీ నేతలు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • CBN on Visakha roads రోడ్లపై మనుషులు చనిపోతుంటే ప్రభుత్వం నిద్రపోతోందా
    CBN on Visakha road Incident విశాఖలో రోడ్డుపై ఉన్న గుంత కారణంగా ఓ వ్యక్తి మరణించిన ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పట్టించుకోదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్ల దుస్థితి చూడలేక చివరికి సామాన్యులే గుంతలను పూడ్చాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీకి మళ్లీ కరోనా
    Sonia Gandhi Corona News కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీకి మళ్లీ కరోనా పాజిటివ్​గా తేలింది. ఆమె ప్రస్తుతం ఐసోలేషన్​లో ఉన్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్​ రమేశ్​ ట్వీట్​ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కామన్వెల్త్ పతకవిజేతలు దేశాన్ని గర్వించేలా చేశారని మోదీ ప్రశంసలు
    Commonwealth Games PM Modi కామన్వెల్త్​ క్రీడల పతకవిజేతలకు ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. వారితో కలిసి ముచ్చటించారు. ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో భారత అథ్లెట్లు చారిత్రక ప్రదర్శన చేసి దేశం గర్వించేలా చేశారని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • లాల్​ సింగ్​ చడ్డా సినిమాకు ఆస్కార్​ గుర్తింపు నెటిజన్లు ఫైర్​
    బాలీవుడ్​ స్టార్​ ఆమిర్​ ఖాన్​ హీరోగా తెరకెక్కిన లాల్​ సింగ్​ చడ్డా సినిమాను ఆస్కార్​ అకాడమీ గుర్తించింది. ట్విట్టర్​ ద్వారా మద్దతు తెలిపింది. భారతీయులకు అనుగుణంగా కథను మార్చుకున్నారంటూ ఓ వీడియో షేర్​ చేసింది. మరోవైపు, హీరోయిన్​ కరీనాకపూర్​ బాయ్​కట్​ లాల్​ సింగ్​ చడ్డా ట్యాగ్​లైన్​పై స్పందించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వృద్ధి పథంలో ఆర్థిక రథం త్వరలోనే 5 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి
    India economy after independence మన ఐటీ ఔషధ వాహన రంగాలు దూసుకెళుతున్న తరుణంలో ప్రపంచంలో 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్​ ఆవిర్భవిస్తోందనే ఆశలు రేకెతున్నాయి. స్వావలంబన దిశగా పయనమవుతుండగా అదే సమయంలో పేదరికం నిరుద్యోగం సమస్యలు భారత్​ను వెంటాడుతున్నాయి. ఈ స్వాతంత్య్ర అమృత మహోత్సవాల వేళ మన ఆర్థిక రంగ ప్రగతి ప్రస్థానాలపై ప్రత్యేక కథనం పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.


Last Updated : Aug 13, 2022, 9:32 PM IST

TAGGED:

9 pm

ABOUT THE AUTHOR

...view details