ETV Bharat / city

గోరంట్ల మాధవ్ వీడియో నిజమైనదేనని చెప్పిన ఫోరెన్సిక్​ రిపోర్ట్​

author img

By

Published : Aug 13, 2022, 4:12 PM IST

Forensic report on MP Gorantla video ఎంపీ గోరంట్ల మాధవ్‌ నగ్న వీడియో నకిలీది కాదని, నిజమైనదేనని అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్‌ నిర్ధరించిందని తెదేపా నేతలు స్పష్టం చేశారు. తెదేపా తరఫున ఈ వీడియోను ప్రైవేటుగా ఫోరెన్సిక్‌ ల్యాబ్ కు పంపామని.. అందులో మార్ఫింగ్‌ జరగలేదని ల్యాబ్‌ నిపుణుడు నివేదిక ఇచ్చినట్లు పార్టీ నేతలు వెల్లడించారు.

Forensic lab report on MP Gorantla video
తెదేపా ఫోరెన్సిక్స్ నివేదిక

Forensic lab report on MP Gorantla video : ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో నిజమైనదేనని.. ఎలాంటి మార్ఫింగ్ జరగలేదని.. అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్‌ నిర్ధరించిందని తెదేపా నేతలు కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌, వంగలపూడి అనిత వెల్లడించారు. అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు.. ప్రైవేట్‌గా ఫోరెన్సిక్ ల్యాబ్ కు వీడియో పంపినట్లు చెప్పారు. ఈ వీడియోను పరిశీలించిన ల్యాబ్ నిపుణుడు జిమ్ స్టాఫ్ వార్డ్‌.. మార్ఫింగ్ జరగలేదని రిపోర్టు ఇచ్చారని తెలిపారు. వీడియోలో ఉన్నది ఎంపీ గోరంట్ల మాధవేనని.. అందులో ఎలాంటి ఎడిటింగ్ లేదా మార్ఫింగ్ జరగలేదని ల్యాబ్‌ నివేదికలో పేర్కొన్నట్టు చెప్పారు. ల్యాబ్ రిపోర్టునూ విడుదల చేశారు.

forensic lab report

వీడియోలో మార్ఫింగ్ జరగలేదనటానికి.. జగన్​కు ఈ ఆధారాలు చాలా? ఇంకేమైనా కావాలా? అని తెదేపా నేతలు ప్రశ్నించారు. నిస్సిగ్గుగా ఇంకా సీఎం జగన్..​ ఎంపీని వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర మహిళలకు ఇప్పుడేం సమాధానం చెప్తారని నిలదీశారు. ఎంపీ పదవిలో ఒక్క నిమిషం కూడా కొనసాగే అర్హత మాధవ్ కు లేదన్నారు. మాధవ్ వీడియోను ఫోరెన్సిక్​కు పంపినా ఉపయోగం లేదని ప్రభుత్వం చెప్పటం పచ్చి అబద్ధమని అన్నారు.

ఇలాంటి పనిచేసిన ఎంపీపై చర్యలు తీసుకోకపోగా.. ముఖ్యమంత్రే ఎంపీని వెనకేసుకొస్తే ఇక రాష్ట్రంలో మహిళలు ఎలా ధైర్యంగా తిరగుతారని తెదేపా నేతలు ప్రశ్నించారు. ఆగస్టు 15న జాతీయ జెండా ఎగురవేసే అర్హత మాధవ్​కు లేదని నేతలు స్పష్టంచేశారు. తాము బయటపెట్టిన ఫోరెన్సిక్ నివేదికపై చర్చించే దమ్ము ధైర్యం ప్రభుత్వంలో ఎవరికైనా ఉందా? అని నిలదీశారు. చేసిన పిచ్చి పనికి చర్యలు తీసుకోకపోగా కులాల్ని లాగటం దుర్మార్గమన్నారు. తప్పు చేసిన వారిని శిక్షించాల్సిందిపోయి.. ప్రభుత్వం, పోలీసులు రక్షించే యత్నం చూసి మహిళలంతా సిగ్గుతో తలదించుకుంటున్నారన్నారు. గోరంట్ల మాధవ్​పై తదుపరి చర్యలేంటో మీడియా సమావేశం ద్వారానైనా సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తమ వద్ద ఉన్న ఫోరెన్సిక్ నివేదికతో ప్రధాని, రాష్ట్రపతి, ఇతర రాజ్యాంగ పెద్దలను కలిసి.. మాధవ్ మళ్లీ పార్లమెంట్​లో అడుగుపెట్టకుండా పోరాడతామని నేతలు స్పష్టంచేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.