ETV Bharat / entertainment

లాల్​ సింగ్​ చడ్డా సినిమాకు ఆస్కార్​ గుర్తింపు నెటిజన్లు ఫైర్​

author img

By

Published : Aug 13, 2022, 7:23 PM IST

బాలీవుడ్​ స్టార్​ ఆమిర్​ ఖాన్​ హీరోగా తెరకెక్కిన లాల్​ సింగ్​ చడ్డా సినిమాను ఆస్కార్​ అకాడమీ గుర్తించింది. ట్విట్టర్​ ద్వారా మద్దతు తెలిపింది. భారతీయులకు అనుగుణంగా కథను మార్చుకున్నారంటూ ఓ వీడియో షేర్​ చేసింది. మరోవైపు, హీరోయిన్​ కరీనాకపూర్​ బాయ్​కట్​ లాల్​ సింగ్​ చడ్డా ట్యాగ్​లైన్​పై స్పందించారు.

Laal Singh Chaddha makes it to Oscar official page, netizens accuse The Academy of acting like PR
Laal Singh Chaddha makes it to Oscar official page, netizens accuse The Academy of acting like PR

Lal Singh Chadda Oscar Academy: ఆమిర్‌ఖాన్‌ కథానాయకుడిగా నటించిన 'లాల్‌ సింగ్ చడ్డా' పైనే గత కొంతకాలంగా బాలీవుడ్‌లో చర్చలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం(ఆగస్టు11) దేశవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రారంభ వసూళ్లను దక్కించుకోలేకపోయింది. బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రానికి అనుకున్న స్థాయిలో వసూళ్లు రాకపోవడంపై సినీ పండితులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ సినిమా ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచే 'బాయ్‌కట్‌ లాల్‌ సింగ్‌చడ్డా' ట్యాగ్‌లైన్‌తో సామాజిక మాధ్యమాల్లో కొందరు తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాను ఆస్కార్​ అకాడమీ గుర్తించింది. ట్విట్టర్​ ద్వారా మద్దతు తెలిపింది.

ఆస్కార్ అవార్డు పొందిన ఒరిజినల్ చిత్రం 'ఫారెస్ట్ గంప్' మ్యాజిక్​ను హిందీలో ఎలా సృష్టించారో వివరించేలా వీడియో క్లిప్​ను ఆస్కార్​ అకాడమీ షేర్ చేసింది. 1994లో విడుదలైన 'ఫారెస్ట్ గంప్' చిత్రం 13 ఆస్కార్‌లకు నామినేట్ అయిందని కూడా వివరించింది. 'రాబర్ట్ జెమెకిస్, ఎరిక్ రోత్ అందించిన కథ భారతీయుల ఆదరణ కూడా పొందింది. ఈ కథను అద్వైత్ చందన్‌, అతుల్ కులకర్ణి భారతీయతకు తగ్గట్టు మార్చుకున్నారు' అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోలో రెండు చిత్రాల సన్నివేశాలను పోల్చింది. అయితే ఆస్కార్​ అకాడమీ గుర్తింపుపై కొందరు నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆమిర్​ సినిమా కోసం అకాడమీ పీఐర్​ ఏజెన్సీలా పనిచేస్తుందంటూ మండిపడుతున్నారు.

కరీనా కపూర్​ షాకింగ్​ కామెంట్స్​..
'లాల్​ సింగ్ చడ్డా' చిత్ర కథానాయిక కరీనాకపూర్.. 'బాయ్‌కట్‌ లాల్‌ సింగ్‌చడ్డా' ట్యాగ్‌లైన్‌తో సామాజిక మాధ్యమాల్లో కొందరు తమ నిరసనలను వ్యక్తం చేయడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ​ఒక ఇంటర్వ్యూలో ''లాల్‌ సింగ్‌ చడ్డా' ఓపెనింగ్స్‌ ఆశించిన రీతిలో లేవు.. దీనిపై మీ స్పందనేంటి?' అన్న ప్రశ్నకు కరీనా సమాధానమిచ్చారు.

"లాల్‌ సింగ్‌ చడ్డాను కొందరు టార్గెట్‌ చేశారు. మొత్తం ప్రేక్షకుల్లో వారు ఒకశాతం ఉంటారు. వాళ్లే ఈ చిత్రాన్ని ట్రోల్‌ చేస్తున్నారు. మిగతావారు ఈ సినిమాని అభిమానిస్తున్నారు. ఈ సినిమాని బహిష్కరిస్తే మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు దూరం చేసినట్లే. రెండున్నరేళ్లు 250 మంది ఈ సినిమా కోసం కష్టపడ్డాం. మూడేళ్ల నుంచి ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. దయచేసి ఈ చిత్రాన్ని బహిష్కరించకండి" అంటూ ఆమె విజ్ఞప్తి చేసింది.

అయితే సినిమా విడుదలకు ముందు కూడా 'బాయ్‌కట్‌ లాల్‌ సింగ్‌చడ్డా' పై స్పందించిన కరీనా..'ప్రతి ఒక్కరికి ప్రతిదాని పై అభిప్రాయం ఉంటుంది. ఒక మంచి సినిమా వీటన్నింటిని అధిగమించి విజయం సాధిస్తుంది' అంటూ వ్యాఖ్యానించింది. ఇదిలా ఉండగా 'లాల్‌ సింగ్ చద్దా' మొదటి రోజు సుమారు రూ.12కోట్లు వసూళ్లను దక్కించుకున్నట్లు సమాచారం.

ఇవీ చదవండి: బింబిసార మూవీ చూసిన బాలయ్య

ప్రభాస్​ స‌లార్ అప్డేట్​ మ‌రో రెండు రోజుల్లో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.