ఆంధ్రప్రదేశ్

andhra pradesh

AP TOP NEWS ఏపీ ప్రధాన వార్తలు 7 PM

By

Published : Aug 25, 2022, 7:06 PM IST

.

7PM TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు 7 AM

  • గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్టు
    Rajasingh Arrest: అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై తెలంగాణలోని గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​ను హైదరాబాద్ పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. మంగళ్​హాట్​, షాహినాయత్​గంజ్​ పోలీస్​స్టేషన్లలో నమోదైన కేసులపై పోలీసులు 41ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భాజపా ఎదగడానికి ఏ పార్టీనైనా చీలుస్తామన్న ఎంపీ అరవింద్
    BJP MP Arvind భాజపా ఎదగడానికి ఏ పార్టీనైనా చీలుస్తామని తెలంగాణలోని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బెజవాడ దుర్గమ్మను ఆయన దర్శించుకున్నారు. విజయవాడ భాజపా రాష్ట్ర కార్యాలయంలో జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తాడికొండ వైకాపాలో కొనసాగుతున్న అంతర్యుద్ధం
    Dokka Vs MLA Sridevi గుంటూరు జిల్లా తాడికొండ నియోజకర్గంలో రాజకీయ పరిణామాలు హాట్ టాపిక్​గా మారాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఉండగా అదనపు ఇన్‌ఛార్జ్‌ పేరుతో డొక్కా మాణిక్యవరప్రసాద్‌కు బాధ్యతలు అప్పగించడం అగ్గి రాజేసింది. పార్టీ అధిష్ఠానం నిర్ణయంపై వైకాపాలో నేతలు రెండు వర్గాలుగా విడిపోయి పోటాపోటీగా సమావేశాలు పెట్టడం చర్చనీయాంశమైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యాఖ్యలను ఖండించిన కాకతీయ సేవా సమాఖ్య
    Kakatiya Seva Samakhya కమ్మ సామాజిక వర్గంపై వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యాఖ్యలను కాకతీయ సేవా సమాఖ్య తీవ్రంగా ఖండించింది. సమాజ అభివృద్ధికి, సేవా దృక్పథానికి మారుపేరుగా నిలిచే కమ్మవారి పట్ల విద్వేషం వెళ్లగక్కడం దారుణమని మండిపడింది. ఎంపీ నగ్న వీడియో అంశాన్ని పక్కదోవ పట్టించడానికి కులంపై అక్కసు వెళ్లగక్కడం ఏంటని సమాఖ్య నాయకులు ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఇప్పటివరకు ఆమె ఓ కానిస్టేబుల్, ఇకపై డీఎస్​పీ
    ఆమె ఓ సాధారణ కానిస్టేబుల్. విధి నిర్వహణ, కుటుంబ బాధ్యతలతో తీరికలేని జీవితం. అయినా, కలను సాకారం చేసుకునేందుకు ఏమాత్రం రాజీ పడకుండా కష్టపడింది. చివరకు అనుకున్నది సాధించింది. త్వరలోనే డీఎస్​పీగా బాధ్యతలు చేపట్టనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆహారం కోసం రైలు దిగిన మహిళపై గ్యాంగ్ రేప్, పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్నా
    అర్ధరాత్రి ఆహారం కోసం రైలు దిగిన ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఐదుగురు కామాంధులు. రెస్టారెంట్​ను చూపిస్తామని చెప్పి తీసుకెళ్లిన దుండగులు రైల్వే యార్డులో రేప్ చేశారు. మరోవైపు, మైనర్ కజిన్​పై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. అడ్డొచ్చిన బామ్మపైనా కోరిక తీర్చుకున్నారు. కేరళలో ఓ మహిళ ఆస్తి కోసం తల్లిదండ్రులకు ఎలుకల మందు కలిపిన టీ ఇచ్చింది. తల్లి మరణించగా.. తండ్రి టీ తాగకుండా తప్పించుకున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కరోనా, మంకీపాక్స్‌, హెచ్ఐవీ మూడూ ఒకేసారి, ఒకే వ్యక్తికి
    కరోనా మహమ్మారి, మంకీపాక్స్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇటలీకి చెందిన 36 ఏళ్ల వ్యక్తికి ఒకే సమయంలో కరోనా వైరస్‌, మంకీపాక్స్‌,హెచ్‌ఐవీ సోకినట్లు తేలడం కలకలం రేపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • న్యాయపాలనా దక్షుడు, వాస్తవికవాది, అత్యుత్తమ భారత ప్రధాన న్యాయమూర్తి
    న్యాయవ్యవస్థ అవసరాలను తీర్చేందుకు జస్టిస్‌ ఎన్‌.వి.రమణ విశేషంగా కృషి చేశారని పలువురు న్యాయవాదులు ప్రశంసించారు. భారత ప్రధాన న్యాయమూర్తులలో ఆయన అత్యుత్తమమైనవారని కొనియాడారు. అద్భుతమైన ప్రగతిశీల దృక్పథం ఉన్న ఆయన న్యాయ వ్యవస్థ అవసరాలను వేగంగా తీర్చగలిగారని ప్రశంసలు కురిపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బాబర్​ అజామ్​కు కోహ్లీ అల్​ ద బెస్ట్, వీడియో వైరల్​
    Virat Kohli meets Babar Azam ఆదివారం ప్రారంభమయ్యే ఆసియా కప్​ కోసం భారత్​ సహా అన్ని దేశాలు ప్రాక్టీస్​ను మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలోనే భారత్​, పాకిస్థాన్​ స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్​ కలిసి ముచ్చటిస్తున్న వీడియోను బీసీసీఐ ట్విట్టర్​లో పోస్ట్ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అదుర్స్‌ అనిపించేలా ది ఘోస్ట్‌ ట్రైలర్‌, ఫుల్‌ యాక్షన్‌ మోడ్‌లో నాగార్జున
    Ghost trailer launch నాగార్జున కథానాయకుడిగా ప్రవీణ్‌ సత్తారు తెరకెక్కిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ది ఘోస్ట్‌. ఈ సినిమా ట్రైలర్‌ని విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన లైగర్‌ ఆడుతున్న థియేటర్లలో గురువారం ఉదయం ప్రదర్శించారు. తాజాగా నటుడు మహేశ్‌బాబు సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details