ETV Bharat / state

తాడికొండ వైకాపాలో కొనసాగుతున్న అంతర్యుద్ధం

author img

By

Published : Aug 25, 2022, 5:15 PM IST

Dokka Vs MLA Sridevi గుంటూరు జిల్లా తాడికొండ నియోజకర్గంలో రాజకీయ పరిణామాలు హాట్ టాపిక్​గా మారాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఉండగా అదనపు ఇన్‌ఛార్జ్‌ పేరుతో డొక్కా మాణిక్యవరప్రసాద్‌కు బాధ్యతలు అప్పగించడం అగ్గి రాజేసింది. పార్టీ అధిష్ఠానం నిర్ణయంపై వైకాపాలో నేతలు రెండు వర్గాలుగా విడిపోయి పోటాపోటీగా సమావేశాలు పెట్టడం చర్చనీయాంశమైంది.

తాడికొండ వైకాపాలో కొనసాగుతున్న అంతర్యుద్ధం
తాడికొండ వైకాపాలో కొనసాగుతున్న అంతర్యుద్ధం

Tadikonda YSRCP issue: గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు మధ్య అంతర్యుద్ధం కొనసాగుతూనే ఉంది. తుళ్లూరులో సమావేశమైన వైకాపా మండల నాయకులు తమ మద్దతు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్​కు ఉంటుందని పరోక్షంగా తెలియజేశారు. నియోజకవర్గాన్ని సరిదిద్దే బాధ్యతను అధిష్టానం డొక్కాకు అప్పగించిందని నేతలు చెప్పారు. నియోజకవర్గాన్ని బలోపేతం చేసేందుకు అదనపు సమన్వయకర్తగా నియమించిన డొక్కా మాణిక్య వరప్రసాద్​ను.. ఎమ్మెల్యే శ్రీదేవి కలుపుకొని ముందుకు సాగుతారని చెప్పారు. 2019కి ముందు సమన్వయకర్తగా ఉన్న ప్రస్తుత జెడ్పీ ఛైర్​పర్సన్​ క్రిస్టినాను కాదని శ్రీదేవికి అప్పగించినప్పుడు తామంతా కలిసి పని చేశామని గుర్తు చేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్​ను కలుపుకొని నియోజకవర్గాన్ని గెలిపించి సీఎంకు కానుకగా అందజేస్తామన్నారు.

మరోవైపు డొక్కా నియామకంపై ఎమ్మెల్యే శ్రీదేవి వర్గం నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. గుంటూరు లాడ్జ్​ సెంటర్​లోని అంబేడ్కర్​ విగ్రహం వద్ద శ్రీదేవి అనుచరులు ఆందోళన చేపట్టారు. శ్రీదేవిని సాగనంపేందుకే డొక్కాను తెచ్చారని వైకాపా నేతలు అభిప్రాయపడ్డారు. డొక్కా రాకతో నియోజకవర్గంలో వైకాపా రెండుగా చీలే పరిస్థితి వచ్చిందన్నారు. వెంటనే డొక్కాను అదనపు సమన్వయకర్త బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. డొక్కా సీనియారిటీ పార్టీని రెండు వర్గాలుగా చేసేందుకేనా ? అని ప్రశ్నించారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.