ఆంధ్రప్రదేశ్

andhra pradesh

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 5 PM

By

Published : Jun 28, 2022, 4:59 PM IST

..

5PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 5 PM

  • రేపు జరగాల్సిన తెదేపా మినీ మహానాడు వాయిదా
    Mini Mahanadu Postponed: గుడివాడ నియోజకవర్గంలో రేపు జరగాల్సిన మినీ మహానాడు వాయిదా పడింది. రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఆధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. త్వరలో తదుపరి తేదీని ఖరారు చేయాలని నేతలను చంద్రబాబు ఆదేశించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • MOHAN BABU: 'పిలిచారు.. వచ్చాను.. సంతకం పెట్టాను.. వెళ్లిపోతున్నా'- మోహన్​బాబు
    MOHAN BABU: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్​ మెంట్ నిధులు విడుదల చేయాలంటూ నిరసన చేపట్టిన కేసులో శ్రీవిద్యానికేతన్ ఛైర్మన్ మోహన్​బాబు హాజరయ్యారు. జిల్లాలోని ఎన్టీఆర్​ కూడలి నుంచి విద్యార్థులతో కలిసి మోహన్ బాబు కుమారులిద్దరితో కోర్టు వరకు కాలినడకన వచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Maoists Surrendered : 60 మంది మావోయిస్టులు లొంగుబాటు!
    అల్లూరి జిల్లాలో మావోయిస్టు సభ్యులు, మావోయిస్టు మిలీషియా, సానుభూతిపరులు సుమారు 60 మంది విశాఖ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ఎనిమిది మంది మహిళ మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.39 లక్షల నగదు, ల్యాండ్‌మైన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఐజీ తెలిపారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బాలినేని తరహాలోనే.. నాకు ఇంటిపోరు తప్పడం లేదు: శ్రీధర్‌రెడ్డి
    మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తరహాలోనే తనకూ ఇంటిపోరు తప్పడం లేదని నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. వాపోయారు. నెల్లూరు జిల్లాకు చెందిన వైకాపా ముఖ్యనేతలు వారి నియోజకవర్గాల్లో కాకుండా తన నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటున్నారని ఆక్షేపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కూలిన నాలుగు అంతస్తుల భవనం.. 10 మంది మృతి
    ముంబయిలో సోమవారం రాత్రి కుర్లాలోని ఓ భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కోతికి చిప్స్ ఇస్తూ 100అడుగుల లోయలో పడిపోయిన టూరిస్ట్
    సరదాగా కోతికి చిప్స్ ఇద్దామని అనుకున్న ఓ వ్యక్తి.. తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఒక్కసారిగా కాలు జారి వంద అడుగుల లోయలో పడిపోయాడు. స్థానిక ట్రెక్కర్లు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి అతడిని కాపాడారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నిజామాబాద్​ కుండలు.. అత్తరు సీసాలు.. ఆ దేశాధినేతలకు మోదీ కానుకలివే!
    Modis Gifts World Leaders: జీ-7 శిఖరాగ్ర సదస్సు కోసం జర్మనీ వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ పర్యటనను చిరస్మరణీయంగా మలుచుకున్నారు. ప్రపంచ దేశాధినేతలకు వివిధ రకాల భారతీయ ఉత్పత్తులను కానుకగా అందించారు. భారతదేశ గొప్ప కళలు, చేతి ఉత్పత్తుల నైపుణ్యం ప్రపంచ వేదికపై ఉట్టిపడేలా చేశారు ప్రధాని. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బాలికపై హత్యాచారం.. బంధువని నమ్మి వెళ్తే...
    తొమ్మిదేళ్ల బాలికను అత్యాచారం చేసి అనంతరం రాయితో కొట్టి చంపాడు ఓ దుర్మార్గుడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని గ్వాలియర్​లో జరిగింది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఒలింపిక్ పసిడి పతక విజేత మృతి
    Hockey Player Varinder Singh Died: ధ్యాన్​చంద్​ అవార్డు గ్రహీత, భారత మాజీ హాకీ ప్లేయర్ వరీందర్​ సింగ్​ మృతి చెందారు. ఆయన మరణంపై పలువురు క్రీడాకారులు, ప్రముఖులు సంతాపం వ్యక్తంచేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • షూటింగ్​ కోసం అల్లరినరేశ్​ రిస్క్​.. దట్టమైన అడవుల్లో 250మందితో!
    Allarinaresh Itlu Maredumilli Prajanikam movie: ఎన్నో విభిన్న కథా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన నటుడు అల్లరి నరేశ్‌ నటిస్తున్న తాజా చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. తాజాగా ఈ చిత్ర టీజర్​ను విడుదల చేసింది మూవీటీమ్​. దట్టమైన అడవులు, ఎత్తైన కొండ ప్రాంతాల్లో షూటింగ్​ కోసం తమ మూవీటీమ్ ఎంతలా కష్టపడిందో ఈ వీడియోలో చూపించారు. దాదాపు 250మంది సిబ్బందితో కలిసి 55 రోజుల పాటు చిత్రీకరణ జరిపినట్లు తెలిపింది. ​ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details