ఆంధ్రప్రదేశ్

andhra pradesh

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 1 PM

By

Published : Jun 6, 2022, 1:00 PM IST

..

1PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 1 PM

  • SSC Results: పదో తరగతి ఫలితాలు విడుదల.. తగ్గేదేలే అన్న బాలికలు
    SSC Results: రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఫలితాల్లో మరోసారి బాలికలు తగ్గేదేలే అన్నట్లుగా తమ సత్తా చాటారు. పరీక్షలకు సుమారు 6,15,900 మంది విద్యార్థులు హాజరవ్వగా.. 4.14 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం ఉత్తీర్ణత 67.26 శాతం నమోదైందని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Minister Jogi Ramesh: మంత్రి జోగి రమేశ్‌ వాహనానికి త్రుటిలో తప్పిన ప్రమాదం
    AP Housing Minister Jogi Ramesh: గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ వాహనానికి తృటిలో ప్రమాదం తప్పింది. మంత్రి వాహన శ్రేణి.. నెల్లూరు వైపు వెళ్తున్న సమయంలో.. ఒంగోలు మండలం పెళ్లూరు వద్ద వాహనశ్రేణిలోని మూడు వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Rains in AP: రాష్ట్ర వ్యాప్తంగా జోరు వానలు.. ఆనందంలో అన్నదాతలు
    Rains in AP: నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల జోరుగా వర్షాలు పడుతున్నాయి. కోస్తాతీరంలో తెల్లవారుజాము నుంచి వానలుపడుతున్నాయి. ఖరీఫ్​ ఆరంభంలోనే వానలు కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ధరల దడ.. ఎడాపెడా.. సామాన్యులు విలవిల
    high prices: నిత్యావసరాల ధరలు భారీగా పెరగడం వల్ల సామాన్యులు అల్లాడిపోతున్నారు. కొండెక్కుతున్న కోడి, యాట మాంసం కొనలేక మాంసాహారం లేని భోజనం, రేట్లు పెరిగిపోయిన పప్పులను తగ్గించుకుని పప్పులేని చారు వైపు మళ్లుతున్నారు. మరికొందరు గ్యాస్‌ సిలిండర్‌ స్థానంలో కట్టెలపొయ్యి వైపు కదులుతున్నారు. పెట్రోల్‌ ధరలు చుక్కల్లో ఉండటంతో ప్రయాణాలూ సామాన్యులపై మరింత భారాన్ని పెంచుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.


  • శునకం విశ్వాసం.. యజమానిపై కాల్పులకు ఎదురెళ్లి.. బుల్లెట్ గాయంతో..
    యజమాని ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణాలను ఫణంగా పెట్టింది ఓ శునకం. యజమానిపై జరిపిన తుపాకీ కాల్పులకు అడ్డుగా నిలిచింది. ఈ క్రమంలో యజమానిని రక్షించి.. ఊపిరి వదిలింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 111అడుగుల ఎత్తైన కేక్​తో సీఎం బర్త్​డే వేడుకలు.. ప్రపంచ రికార్డు!
    Yogi Adityanath Birthday: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పుట్టినరోజు వేడుకలను అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక భాజపా కార్యకర్త అమీర్ జైదీ.. 111.6 అడుగుల ఎత్తైన కేక్‌ను తయారు చేయించి కట్​ చేశారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన కేక్​ను కట్ చేసి రికార్డు సృష్టించాలన్న లక్ష్యంతో ఇలా చేసినట్లు ఆయన తెలిపారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సుశాంత్ పేరుతో మోసం.. ఏడాది పాటు ఫ్రీగా హోటల్​లో.. నకిలీ చెక్​తో బురిడీ
    దివంగత నటుడు సుశాంత్ సింగ్​ రాజ్​పుత్​పై సినిమా తీస్తామంటూ ఓ హోటల్​ యజమానిని బురిడీ కొట్టించారు కొందరు వ్యక్తులు. హోటల్​లోనే సంవత్సరంపాటు ఎలాంటి అద్దె కట్టకుండా విడిది చేశారు. వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
    Gold Price Today: బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల పసిడి ధర రూ. 52,850గా ఉండగా.. కిలో వెండి ధర రూ. 64,300గా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సిరాజ్​ వల్లే అతనితో గొడవ జరిగింది: రియాన్​ పరాగ్​
    Harshal patel Riyan parag fight: ఈ ఐపీఎల్​లో ఆర్సీబీ ఆటగాడు హర్షల్​ పటేల్​తో జరిగిన గొడవ గురించి వివరించాడు రాజస్థాన్​ ప్లేయర్​ రియాన్ పరాగ్​. ఈ గొడవ జరగడానికి సిరాజ్​ ఓ కారణమని చెప్పాడు పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తమన్నా-అనిల్​రావిపూడి మధ్య ఏం గొడవ జరిగిందంటే?
    Tamannah Anilravipudi fight: మిల్కీ బ్యూటీ తమన్నాతో గొడవపై దర్శకుడు అనిల్‌ రావిపూడి స్పందించారు. అసలేం జరిగిందో వివరించారు. ప్రస్తుతం అంతా బాగానే ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details