ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైయస్సార్ జిల్లాలో వీఆర్వో ఆత్మహత్యాయత్నం.. కారణం ఏంటంటే..!

By

Published : Feb 9, 2023, 3:43 PM IST

VRO suicide attempt: వీఆర్వో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వైయస్సార్ జిల్లా పెద్దముడియం మండలంలో జరిగింది. గుండ్లకుంట గ్రామసచివాలయంలో పనిచేసే వీఆర్వో వెంకట శివ విషగుళికలు మింగాడు. తహసీల్దారు ఒత్తిడి, లంచం అడగడం వల్లే ఈ దారుణానికి పాల్పడినట్లు లేఖ ద్వారా బయటపడింది. ఇదిలావుంటే వీఆర్వో వెంకట శివ ఆత్మహత్యాయత్నంలో తన ప్రమేయం లేదని తహసీల్దార్​ ఖండించారు.

వీఆర్వో
వీఆర్వో ఆత్మహత్యా యత్నం

VRO suicide attempt: వీఆర్వో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వైయస్సార్ జిల్లా పెద్దముడియం మండలంలో చోటు చేసుకుంది. గుండ్లకుంట గ్రామసచివాలయంలో పని చేసే వీఆర్వో వెంకట శివ విషగుళికలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఉన్నతాధికారి ఒత్తిడి, లంచం అడగడం వల్లే ఆ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ లేఖ బయటపడింది.

విషగుళికలు మింగి..:వెంకట శివ బుధవారం జమ్మలమడుగు రైల్వే స్టేషన్ సమీపంలో విషగుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పెద్దముడియం గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఫోన్ చేసి.. విషయం చెప్పి లొకేషన్ పంపించాడు. జమ్మలమడుగు వార్డు సచివాలయం ఉద్యోగుల సాయంతో వెంకటశివను గుర్తించి.. ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు తీసుకెళ్లారు.

తహసీల్దారు వేధింపులతోనే..:తహసీల్దారు వేధింపులతోనే ఆత్మహత్యాయత్నం చేసినట్లు వీఆర్వో వెంకట శివ రాసిన లేఖ ద్వారా బయటపడింది. ఈ లేఖను శివ సోదరుడు బయటపెట్టాడు. పెద్దముడియం తహసీల్దారు తరచూ వేధిస్తున్నాడని, లంచం కింద డబ్బులు అడుగుతున్నాడని శివ లేఖలో రాశాడు. అంతేకాకుండా మ్యుటేషన్, రైతుల భూములను ఆన్​లైన్​లో ఎక్కించేందుకు అదనంగా వసూలు చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నాడు. వీఆర్వో ఆత్మహత్యాయత్నం ఘటనపై తహసీల్దార్​ స్పందించాడు. తాను ఎవరినీ లంచం అడగలేదని.. ఎవరినీ వేధించలేదని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details