జగన్‌రెడ్డి 3 రాజధానులు అని ఒక్కటీ పూర్తి చేయలేదు - రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు : వైఎస్ షర్మిల

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 21, 2024, 4:02 PM IST

Updated : Jan 23, 2024, 4:49 PM IST

AP PCC president Sharmila criticizes CM Jagan

AP PCC president Sharmila criticizes CM Jagan: రాష్ట్రంలోని ప్రజల ఆకాంక్షల మేరకు వైఎస్సార్సీపీ, టీడీపీ పనిచేయడం లేదని వైఎస్ షర్మిల అన్నారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం వైఎస్సార్సీపీ, టీడీపీ బీజేపీలపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు రూ.2 లక్షల కోట్లు అప్పు చేస్తే, సీఎం జగన్‌ రూ.6.50 లక్షల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. మెుత్తంగా రాష్ట్రంపై రూ.10 లక్షల కోట్లతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని షర్మిల మండిపడ్డారు.

AP PCC president Sharmila criticizes CM Jagan: ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాట్లాడిని వైఎస్ షర్మిల వైఎస్సార్సీపీ, టీడీపీ బీజేపీలపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దోచుకోవడం, దాచుకోవడమే ఉందని, రోడ్లు వేయడానికి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని ఎద్దేవా చేశారు. మొత్తంగా రాష్ట్రంపై రూ. 10లక్షల కోట్లు అప్పులు ఉన్నాయన్నారు. జగన్​రెడ్డి మూడు రాజధానుల పేరుతో ఒక్క రాజధాని కూడా కట్టలేదని షర్మిల విమర్శించారు.

జగన్‌రెడ్డి 3 రాజధానులు అని ఒక్కటీ పూర్తి చేయలేదు - రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు : వైఎస్ షర్మిల

రాష్ట్రంపై రూ.10 లక్షల కోట్లు అప్పులు: రాష్ట్రంలోని ప్రజల ఆకాంక్షల మేరకు వైఎస్సార్సీపీ. టీడీపీ పనిచేయడం లేదని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు రూ.2 లక్షల కోట్లు అప్పు చేస్తే, వైఎస్సార్సీపీ అధినేత జగన్‌ రూ.6.50 లక్షల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. మెుత్తంగా రాష్ట్రంపై రూ.10 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని, ఈ 10 ఏళ్లలో పది పరిశ్రమలైనా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో రోడ్లు వెయ్యడానికి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని, షర్మిల విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దోచుకోవడం, దాచుకోవడమే అన్నట్లుగా తయారైందని షర్మిల ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్‌బీఐ హెచ్చరిక - రుణం తీసుకునే సంస్థలపై పట్టు ఉండాలని సూచన

బీజేపీ చేతిలోనే ఎంపీలందరూ: కేంద్రంలో బీజేపీతో పొత్తులో ఉండికూడా చంద్రబాబు ప్రత్యేక హోదా తెలేకపోయారని విర్శించారు. ఇక ప్రతిపక్షంలో ఉండగా జగన్‌రెడ్డి ప్రత్యేక హోదా కోసం మూకుమ్మడి రాజీనామా చేస్తామన్నారని, కానీ జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ఒక్కసారైనా ప్రత్యేక హోదాకోసం ఉద్యమం చేశారా అంటూ ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ అయినా, టీడీపీ అయిన, ఎంపీలందరూ బీజేపీ తొత్తులే అంటూ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. బీజేపీ ఏం చెప్తే దానికి రాష్ట్ర ఎంపీలు తలఊపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ, టీడీపీలకు చెందిన ఎంపీలందరూ బీజేపీ చేతిలో ఉన్నారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని హామీ ఇచ్చిందని, కానీ, బీజేపీ పాలనలో రైతులు అప్పులపాలయ్యారని షర్మిల విమర్శలు గుప్పించారు.
అమరావతిపై జగన్ సర్కార్ మరో కుట్ర! - మాస్టర్​ ప్లాన్​ను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం

రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌: రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదంటే ఆ పాపం చంద్రబాబు, జగన్‌దే అని షర్మిల స్పష్టం చేశారు. చంద్రబాబు అమరావతి పేరిట 3డీ గ్రాఫిక్స్‌ చూపించారని, జగన్‌రెడ్డి 3 రాజధానులు అని ఒకటీ చేయలేదని ఆరోపించారు. చివరకూ రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ని చేశారని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడం పాలకులకు చేతకాలేదని విమర్శలు గుప్పించారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే వేలాదిగా ఉద్యోగాలు వచ్చేవని షర్మిల పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఆళ్ల రామకృష్ణారెడ్డికి షర్మిల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అభిమానించే వాళ్లంతా ఆయన బిడ్డగా తనతో చేతులు కలపాలని వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. రాజశేఖర్‌రెడ్డి మూలాలు, ఊపిరి కాంగ్రెస్ పార్టీయే అని, రాష్ట్రంలో రాజశేఖర్‌రెడ్డి ఆశయాలను మళ్లీ తెచ్చేందుకు కృషి చేస్తానని షర్మిల పేర్కొన్నారు.

ప్రచార పిచ్చి- అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సభలోనూ సీఎం జగన్​పై నేతల ఆహా ఓహో!

Last Updated :Jan 23, 2024, 4:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.