తెలంగాణ

telangana

లైట్​ బీర్ల కోసం యువకుడి పాదయాత్ర - అమ్మకాలు చేపట్టాలని ఆబ్కారీ శాఖకు వినతి పత్రం - Youth Padayatra For Beer

By ETV Bharat Telangana Team

Published : Apr 29, 2024, 10:36 PM IST

Man Padayatra For KF Beers

Man Padayatra For KF Beers : సహజంగా కొందరు వివిధ అంశాలపై పోరాడుతూ కొన్ని సందర్భాల్లో పాదయాత్ర చేస్తారు. కానీ ఓ యువకుడు కింగ్​ ఫిషర్​ లైట్​ బీర్లు అమ్మడం లేదంటూ పాదయాత్ర చేపట్టాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జరిగింది. మంచిర్యాలలోని ఐబీ చౌరస్తా నుంచి పాదయాత్ర చేపట్టిన జిల్లా తాగుబోతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తరుణ్, ఆబ్కారీ శాఖ సూపరింటెండెంట్​ను కలిసి వినతిపత్రం సమర్పించాడు.   

అధిక ఉష్ణోగ్రతలతో, మండుటెండలతో ఇబ్బందులకు గురవుతున్న తమకు కింగ్ ఫిషర్ లైట్ బీర్ తాగితే సేదతీరుతామని తరుణ్ తెలిపారు. 20 రోజులుగా మద్యం దుకాణాలలో వాటి అమ్మకాలు నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. అధిక ఆల్కహాల్ ఉన్న బీర్లు సేవిస్తే తమకు వాంతులు, విరేచనాలు అవుతున్నాయని చెప్పాడు. మత్తులో ఏ పనులు చేసుకోలేకపోతున్నామని వాపోయాడు. ఎన్నో రోజులుగా తమకు అలవాటు ఉన్న కింగ్​ ఫిషర్​ లైట్​ బీర్లను తిరిగి అమ్మకాలు చేయాలని డిమాండ్​ చేశాడు. 

ABOUT THE AUTHOR

...view details