ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కదిరి ఎమ్మెల్యేకు హైకోర్టులో ఊరట - సంబరాలు చేసుకుంటున్న టీడీపీ నేతలు - Kandikunta Prasad Case dismiss

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 23, 2024, 1:45 PM IST

Telangana High Court Dissmiss CBI Court Case On Ex MLA: తెలుగుదేశం పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ ఇన్చార్జిపై కొన్ని కేసులను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల ముందు న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. మాజీ శాసన సభ్యుడు కందికుంట వెంకట ప్రసాద్​కు (Kandikunta Venkata Prasad) సీబీఐ కోర్టు విధించిన శిక్షను తెలంగాణ సర్వోన్నత న్యాయస్థానం కొట్టి వేసింది.

కదిరి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ కందికుంట సతీమణి యశోదా దేవిని ప్రకటించింది. కందికుంటపై ఉన్న కేసులు కొట్టివేయడంతో పార్టీ శ్రేణులు నియోజకవర్గ వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. నంబుల పూలకుంట మండల కేంద్రంలో కదిరి, రాయచోటి ప్రధాన రహదారిపై బాణసంచా కాల్చారు. మరోవైపు కదిరి పట్టణంలోని 32వ వార్డు, తలుపుల మండలం ఉడుములకుర్తిలో వెంకటప్రసాద్, పార్టీ శ్రేణులు ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. రాబోయే ఎన్నికలలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి (Alliance) అభ్యర్థి యశోదా దేవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు.

కేసు:నకిలీ డీడీలతో బంగారం కొనుగోలు చేశారంటూ వెంకటప్రసాద్‌పై సీబీఐ గతంలో రెండు కేసులు నమోదు చేసింది. ఈ కేసులపై నాంపల్లి సీబీఐ కోర్టు గతంలోనే తీర్పును వెలువరించింది. ఒక కేసులో ఐదేళ్లు, మరో కేసులో ఏడేళ్లు జైలు శిక్ష విధించింది. అయితే సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును కందికుంట తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ మీద విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు కందికుంట వెంకటప్రసాద్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

ABOUT THE AUTHOR

...view details