తెలంగాణ

telangana

రామాలయంలోని శివలింగంపై నాగుపాము - ఆశ్యర్యానికి గురైన ప్రజలు

By ETV Bharat Telangana Team

Published : Jan 28, 2024, 2:29 PM IST

Cobra On Shiva Lingam In Huzurabad

Snake On Shiva Lingam In Huzurabad :  కరీంనగర్ జిల్లా హుజూరాబాద్​లో ఉన్న రామాలయం వద్ద ఉన్న శివ లింగంపై నాగుపాము ప్రత్యక్షమైంది. భక్తులు ఉదయాన్నే ఆలయంలో పూజలు చేస్తుండగా శివ‌లింగం చుట్టూ నాగుపాము చుట్టుకుంది. ప‌డ‌గ విప్పిన పామును చూసి భ‌క్తులు ఆశ్చ‌ర్య‌పోయారు. మొదట భక్తులు కొంత ఆందోళనకు గురైనా ఆ తర్వాత పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టారు. రామాల‌యంలోని శివ‌లింగం చుట్టూ నాగుపాము చుట్టుకున్న వార్త భ‌క్తుల‌కు, స్థానికుల‌కు తెలిసింది. దీంతో ఇరుగు పొరుగు గ్రామాల నుంచి భ‌క్తులు, స్థానికులు పెద్ద సంఖ్య‌లో ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్నారు. కొంద‌రు భ‌క్తులు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.

Cobra Coils Around Shiva Lingam In Ramalayam : చాలా రోజుల నుంచి నాగుపాము ఆలయ ప్రాంగణంలోనే తిరుగుతున్నట్లు ఆలయ పూజారి చెప్పారు. కాగా నాగుపాము కాసేపు లింగం చుట్టుూ తిరిగి దగ్గరలో ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్లిపోయింది. శివ లింగంపై ఉన్న నాగు పామును కొందరు మొబైల్స్‌లో చిత్రీక‌రించి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు అవుతుంది.

ABOUT THE AUTHOR

...view details