తెలంగాణ

telangana

LIVE : వేములవాడ రాజన్న సన్నిధిలో ప్రధాని మోదీ - PM MODI VISTS VEMULAWADA TEMPLE

By ETV Bharat Telangana Team

Published : May 8, 2024, 10:03 AM IST

Updated : May 8, 2024, 10:11 AM IST

PM Modi Public Meeting in Karimnagar Live : రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. వేములవాడ, వరంగల్‌లో జరిగే బహిరంగ సభలకు హాజరవుతారు. లోక్​సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నమోదీ రాత్రి రాజ్​భవన్‌లో బస చేశారు. ఈరోజు ఉదయం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న మోదీ అక్కడి నుంచి హెలికాప్టర్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు వెళ్లారు. శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అనంతరం కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థి బండి సంజయ్‌కు మద్దతుగా ప్రచార సభలో మోదీ పాల్గొననున్నారు. ఆ తర్వాత వరంగల్ పార్లమెంటు బీజేపీ అభ్యర్ధి అరూరి రమేశ్ గెలుపు కోరుతూ ప్రధాని మోదీ వరంగల్​లో జరిగే పార్టీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సభలకు స్థానిక పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు. 
Last Updated : May 8, 2024, 10:11 AM IST

ABOUT THE AUTHOR

...view details