తెలంగాణ

telangana

బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి రంగారెడ్డిపై చిన్నచూపు : పరిగి ఎమ్మెల్యే

By ETV Bharat Telangana Team

Published : Feb 17, 2024, 5:13 PM IST

Parigi MLA Rammohan Reddy Fires on BRS

Parigi MLA Rammohan Reddy Fires on BRS : గత బీఆర్ఎస్‌ పాలనలో ప్రాజెక్టుల నిర్మాణంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి దుయ్యబట్టారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టులపై రామ్మోహన్‌ రెడ్డి మాట్లాడారు. 

White Paper on Irrigation Projects : తెలంగాణ కోసం పరిగి, వికారాబాద్‌ ప్రజలు కూడా పోరాడారని, కానీ బీఆర్ఎస్‌ పాలనలో కేసీఆర్‌ మాత్రం పరిగి, వికారాబాద్‌ను చిన్నచూపు చూశారని రామ్మోహన్‌రెడ్డి దుయ్యబట్టారు. గత ప్రభుత్వం సిరిసిల్ల, సిద్దిపేటకు మాత్రమే నీళ్లు, నిధులు ఇచ్చారని, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రాంతాన్ని మోసం చేసేవాణ్ని పొలిమేరల వరకు తరిమికొట్టాలని, కానీ ప్రాంతం వాడే మోసం చేస్తే ఉన్నచోటే పాతరేయాలని కాళోజీ అన్నారని గుర్తు చేశారు. నిర్లక్ష్యానికి గురైన వికారాబాద్, చేవేళ్ల, పరిగి నియోజకవర్గాలపై దృష్టిసారించాలని, యుద్ధప్రాతిపదికన పాలమూరు రంగారెడ్డి పూర్తిచేసి ఉమ్మడి రంగారెడ్డికి సాగు, తాగు నీరు అందించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details