తెలంగాణ

telangana

నిజాయితీ చాటుకున్న వృద్ధురాలు - రూ.3 లక్షల విలువైన పర్సు అప్పగింత - Old Woman Hand over Purse

By ETV Bharat Telangana Team

Published : Apr 13, 2024, 3:59 PM IST

Old Woman Hand over Purse to Police : రోడ్డుపై ఏమైనా వస్తువులు పోగొట్టుకుంటే ఇక పోయినట్లే అని అనుకుంటాం. కానీ ఈ రోజుల్లో కూడా కొందరు పోగొట్టుకున్న వస్తువులను అప్పగించి తమ నిజాయితీని చాటుకుంటున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఓ వృద్ధురాలు తన నిజాయితీని చాటుకుంది. ఆమెకు రోడ్డుపై దొరికిన 3 లక్షల విలువైన బంగారు నగలున్న పర్సును పోలీసులకు అప్పగించింది. యాదాద్రి భువనగిరి జిల్లా పుల్లాయిగూడెంకి చెందిన అరుణమ్మ, భర్తతో కలసి బంధువుల ఇంటి వెళ్తున్న క్రమంలో మోత్కూరు పోతాయగడ్డ వద్ద తన పర్సు చేజారి పడిపోయింది.

Police Appreciated Old Woman for Hand over Purse : ఆ పర్సులో 4 తులాల బంగారం గొలుసు, రూ.1700 నగదు ఉన్నాయని ఆందోళనకు గురైంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా వివరాలు సేకరించి విచాణ జరుపుతున్న క్రమంలో ఆత్మకూరుకు చెందిన ఆలకుంట్ల లక్షమ్మ, ఎస్సైకి పర్సు అప్పగించింది. నిజాయితీగా పర్సు ఇచ్చిన వృద్ధురాలిని పోలీసులతో పాటు స్ధానికులు అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details