తెలంగాణ

telangana

నేను తక్కువ మాటలు చెప్పి ఎక్కువ పనులు చేసే వ్యక్తిని : మంత్రి శ్రీధర్‌ బాబు

By ETV Bharat Telangana Team

Published : Mar 2, 2024, 1:58 PM IST

Minister Sridhar Babu

Minister Sridhar Babu Interesting Comments : తాను తక్కువ మాటలు చెప్పి, ఎక్కువ పనులు చేసే వ్యక్తినని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అంబేడ్కర్ నాలెడ్జి సెంటర్లను ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుందని పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో ఏర్పాటు చేసిన దివంగత నేత, మాజీ స్పీకర్‌ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.

నెలలో మొదటి తారీఖున మన ఇండ్లలో రూపాయి లేకుండా చేసిన ఘనత బీఆర్ఎస్‌ పార్టీకే దక్కిందని శ్రీధర్‌బాబు ఎద్దేవా చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే నెలలో మొదటి రోజునే ప్రభుత్వ అధికారులకు జీతాలు చెల్లిస్తున్నామని తెలిపారు. అంతకుముందు మంథనిలోని దుద్దిళ్ల శ్రీపాదరావు విగ్రహాలకు శ్రీధర్‌బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు, పండ్లు పంపిణీ చేశారు.  

Sridhar Babu Visit Peddapalli District : అనంతరం శ్రీధర్‌బాబు విద్యుత్ వినియోగదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా అర్హులైన వారికి జీరో బిల్లులను అందజేశారు. తన తండ్రి, దివంగత శ్రీపాదరావు ఆశయాల మేరకు మంథని ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. శ్రీపాదరావు ఆశయాల మేరకు రైతులకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా ఈ ప్రాంతంలో లిఫ్ట్ ఏర్పాటు చేస్తామని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details