తెలంగాణ

telangana

చిన్నారులతో సరదాగా షటిల్ ఆడిన కేటీఆర్ - సోషల్​ మీడియాలో వీడియో వైరల్ - KTR played Shuttle With Children

By ETV Bharat Telangana Team

Published : Apr 6, 2024, 2:13 PM IST

KTR Played Shuttle With Children : బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తన నియోజకవర్గం సిరిసిల్లలో సరదాగా చిన్నారులతో కాసేపు గడిపారు. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక సిరిసిల్లలోనే ఎక్కువగా ఉంటున్న  కేటీఆర్ పార్టీ కార్యక్రమాలతో పాటు చిన్నారులతో గడిపేందుకు అధిక సమయాన్ని  కేటాయిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రజలతో కూడా ముచ్చటించేందుకు సమయం కేటాయిస్తున్నారు. శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన పొలంబాట కార్యక్రమం ముగిసిన అనంతరం సాయంత్రం వేళ చిన్నారులతో షటిల్ ఆడారు. 

ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చిన్నారులతో సరదాగా చేసిన సంభాషణ  సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.  లోక్​సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓ వైపు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటు మరోవైపు చిన్నపిల్లలతో సరదాగా గడపడం పట్ల ఆ పార్టీ కార్యకర్తల్లో ఆనందం నెలకొంది. మరోవైపు అధికార కాంగ్రెస్​ పార్టీపై తనదైన శైలిలో విమర్శలు సంధిస్తూ ముందుకుపోతున్నారు కేటీఆర్. మరోవైపు బీఆర్​ఎస్ పార్టీ ఎన్నికల్లో ఎలాగైనా అధిక స్థానాల్లో గెలుపొందాలనే లక్ష్యంతో దూసుకుపోతోంది                    

ABOUT THE AUTHOR

...view details