తెలంగాణ

telangana

LIVE : కొత్తగూడెం బీజేపీ బహిరంగ సభలో జేపీ నడ్డా - Jp Nadda live

By ETV Bharat Telangana Team

Published : Apr 29, 2024, 12:51 PM IST

Updated : Apr 29, 2024, 1:18 PM IST

Jp Nadda Live : తెలంగాణలో అధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. జాతీయ నేతల దిశానిర్దేశంతో ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో వెళ్తున్న అభ్యర్థులు, పార్టీ శ్రేణులు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడుతూ, ప్రస్తుత కాంగ్రెస్‌ సర్కార్ ఇచ్చిన హామీల అమలు తీరుపై విమర్శలు గుప్పిస్తూ ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నారు. మరోవైపు పార్టీ అగ్రనేతలు రాష్ట్రానికి వరుస కడుతున్నారు. తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థిస్తూ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తున్నారు.ఇందులో భాగంగా తాజాగా నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటిస్తున్నారు. తొలుత కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సభ అనంతరం ఆయన మహబూబాబాద్‌ బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత హైదరాబాద్‌ నిజాంపేటలోని రోడ్‌ షోలో పాల్గొననున్నారు. అదేవిధంగా హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి ముఖ్య నేతలతో జేపీ నడ్డా భేటీ కానున్నారు. రాత్రికి హైదరాబాద్‌లోనే ఆయన బస చేయనున్నారు.
Last Updated :Apr 29, 2024, 1:18 PM IST

ABOUT THE AUTHOR

...view details