తెలంగాణ

telangana

గ్యాస్ సిలిండర్ల వాహనంలో మంటలు - తప్పిన పెను ప్రమాదం - Fire Accident in Gas Cylinder Auto

By ETV Bharat Telangana Team

Published : May 9, 2024, 5:12 PM IST

గ్యాస్ సిలిండర్ల వాహనంలో మంటలు - తప్పిన పెను ప్రమాదం (ETV Bharat)

Gas Cylinder Auto Fire Accident : గ్యాస్ సిలిండర్లను సరఫరా చేసే వాహనంలో మంటలు చెలరేగగా డ్రైవర్ అప్రమత్తతతో భారీ ప్రమాదం తప్పింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని మంగలి తండాలో జరిగింది. వంతెనపై వెళ్తున్న వాహనంలో అకస్మాత్తుగా మంటలు రావడంతో వెంటనే గమనించిన వాహన డ్రైవర్ కొన్ని సిలిండర్లు తొలగించాడు. మరో రెండు సిలిండర్లు, వాహనంలోనే ఉండిపోవడంతో మంటల తాకిడికి ఆ సిలిండర్లు పేలాయి. 

Fire Accident in Gas Cylinder Auto : వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. వాహనంలో మిగతావి ఖాళీ సిలిండర్లే కావడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా వాహనంలో అగ్నిప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల అయ్యిందా లేదా మరో కారణం ఏమైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు వేసవి కాలంలో వేడికి కొన్ని సందర్భాల్లో మంటలు చెలరేగుతాయని, వీలైనంత వరకు వాహనాలను నీడలో ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details