తెలంగాణ

telangana

LIVE : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ - CM REVANTH INTERVIEW LIVE

By ETV Bharat Telangana Team

Published : Apr 29, 2024, 8:02 AM IST

Updated : Apr 29, 2024, 8:57 AM IST

CM Revanth Interview LIVE : రాష్ట్రంలో రైతులకు వచ్చే ఆగస్టు నాటికి రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని అందుకు తమ వద్ద సమగ్ర ప్రణాళిక ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఫార్మర్స్‌ వెల్పేర్‌  పేరుతో ఓ కార్పోరేషన్‌ ను ఏర్పాటు చేసి రైతుల అప్పులను ప్రభుత్వం బదలాయించుకుంటుందని, విడతల వారిగా బ్యాంకులకు ప్రభుత్వమే ఆ మొత్తం వడ్డీతో సహా చెల్లిస్తుంద తెలిపారు. అందుకోసం త్వరలోనే బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతామని ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలోని 69 లక్షల మంది రైతులకు రుణ విముక్తి కల్పిస్తామని రేవంత్‌రెడ్డి ఈటీవి, ఈనాడుకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన ఆలోచనలను ఆవిష్కరించారు. రాష్ట్రంలో కరవు, విద్యుత్‌ , రైతాంగ సమస్యలు, సాగునీటి ప్రాజెక్టులపై మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆరోపణలపై రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో ప్రతిస్పందించారు. దేశంలో తిరిగి భాజాపా గెలిస్తే జరిగే అనర్థాలపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని, వచ్చే పదిహేను రోజుల పాటు తమ పార్టీ అగ్రనేతలతో కలిసి ప్రచారాన్ని మరో దశకు తీసుకెళ్లి 14 సీట్లు గెలుస్తామంటున్న రేవంత్‌రెడ్డితో ముఖాముఖి.
Last Updated :Apr 29, 2024, 8:57 AM IST

ABOUT THE AUTHOR

...view details