తెలంగాణ

telangana

కంటోన్మెంట్​ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ప్రత్యర్థులు డిపాజిట్లు కోల్పోవడం ఖాయం : తలసాని శ్రీనివాస్ - CANTONMENT BYPOLL 2024

By ETV Bharat Telangana Team

Published : May 2, 2024, 5:10 PM IST

Cantonment BRS Candidate Niveditha Bypoll Campaign (ఈటీవీ భారత్ ప్రత్యేకం)

Cantonment BRS Candidate Niveditha Bypoll Campaign : సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రత్యర్థులకు డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సాయన్న చేసిన సేవలు ఇంకా ప్రజలు గుర్తుపెట్టుకున్నారని అన్నారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత రెండో వార్డులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు మద్దతుగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రచారం నిర్వహించారు.

మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డిని, కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా నివేదితను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కంటోన్మెంట్ ప్రజలంతా నివేదితకు బ్రహ్మరథం పడుతున్నారని, మంచి మెజారిటీతో ఆమె గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కంటోన్మెంట్​లో కాంగ్రెస్ నాయకులు తప్ప కేడర్ లేదని ఎద్దేవా చేశారు. పూటకో పార్టీ మార్చే నేతలను ప్రజలు నమ్మరని ఆయన అన్నారు. కంటోన్మెంట్ రెండో వార్డులోని అన్నానగర్, ఇందిరమ్మ నగర్, రసూల్​పురా ప్రాంతాల్లో కంటోన్మెంట్ బీర్ఎస్ అభ్యర్థి నివేదిత ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details