తెలంగాణ

telangana

LIVE : నల్గొండలో బీఆర్ఎస్‌ బహిరంగ సభ - ప్రత్యక్ష ప్రసారం

By ETV Bharat Telangana Team

Published : Feb 13, 2024, 4:38 PM IST

Updated : Feb 13, 2024, 5:51 PM IST

BRS Nalgonda Public Meeting Live : సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్‌ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్యబోర్డుకు అప్పగించిందని చెబుతున్న బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల్ని కేఆర్ఎంబీకి అప్పగించినందుకు నిరసనగా, కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ నినాదంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నల్గొండ వేదికగా బహిరంగ సభలో పాల్గొన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ పాల్గొన్న తొలి సభ కావడంతో భారీగా జనం తరలివచ్చారు.  ఇక్కడి నుంచే గులాబీ పార్టీ అధినేత లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరిస్తున్నారు. ఈ బహిరంగ సభకు ఉమ్మడి నల్గొండతో పాటూ కృష్ణా పరివాహకంలోని మహబూబ్‌నగర్‌, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రైతులు, ప్రజల్ని తరలివచ్చారు. బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటూ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు భారీ కాన్వాయ్‌తో తెలంగాణ భవన్ నుంచి నల్గొండకు వచ్చారు. కృష్ణా జలాల వివాదం రాష్ట్ర ప్రజల జీవన్మరణ సమస్య అని, కాంగ్రెస్ పార్టీకి, కేంద్రంతో లోపాయికారి ఒప్పందం ఉందని బీఆర్ఎస్ ఆరోపించింది. అందుకే కేఆర్ఎంబీకి అప్పజెప్పారని పేర్కొంది. 

Last Updated :Feb 13, 2024, 5:51 PM IST

ABOUT THE AUTHOR

...view details