తెలంగాణ

telangana

కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రిని కలిసిన బీఆర్​ఎస్​ ఎంపీల బృందం - ప్రాజెక్టుల అప్పగింతపై అభ్యంతరం

By ETV Bharat Telangana Team

Published : Feb 2, 2024, 3:26 PM IST

BRS MPs Visit Minister Gajendra Shekhawat

BRS MPs Visit Minister Gajendra Shekhawat : కృష్ణాబోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆర్​ఎస్​ ఎంపీల బృందం దిల్లీలోని కేంద్ర జలశక్తి శాఖమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను కలిశారు. తమకు ఉన్న అభ్యంతరాలు తెలియజేస్తూ షెకావత్‌కు లేఖ అందించారు. కేంద్రం నిర్ణయం వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని కేఆర్​ఎంబీకి (KRMB ) అప్పగించాలన్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఎంపీలు కోరారు. కృష్ణా ట్రైబ్యునల్‌లో విచారణ పూర్తి అయ్యే వరకు ఇరు రాష్ట్రాలకు సమ పద్ధతిలో నీటి కేటాయింపులు ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.  

MP Nama Nageswara Rao about Krishna Board : ఈ సందర్భంగా బీఆర్​ఎస్​ లోక్​సభ పక్షనేత నామ నాగేశ్వరరావు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి కృష్ణాబోర్డు వల్ల జరగనున్న నష్టాలను కేంద్ర జలశక్తి శాఖమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు వివరించామని నామ తెలిపారు. ప్రాజెక్టుల అప్పగింతకు ప్రభుత్వం అంగీకరించిదని మంత్రి చెప్పారన్న నామ, ప్రభుత్వం అంగీకరించినా ప్రజలకు నష్టం జరగకుండా ప్రాజెక్టుల గురించి మళ్లీ ఒకసారి పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు.  

ABOUT THE AUTHOR

...view details