తెలంగాణ

telangana

వంగరలో ఉద్రిక్తత - బండి సంజయ్​ వాహనంపై కోడిగుడ్లు విసిరిన దుండగులు

By ETV Bharat Telangana Team

Published : Feb 28, 2024, 3:09 PM IST

Attack On Sanjay In Hanamkonda : హన్మకొండ జిల్లా వంగరలో గుర్తుతెలియని వ్యక్తులు ప్రజాహిత యాత్ర వాహనశ్రేణిపై కోడిగుడ్లు విసరడం ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఇంటిని బండి సంజయ్ సందర్శించి ముల్కనూర్ బయలుదేరుతున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు కోడిగుడ్లు విసరడంతో మీడియా వాహనంపై పడ్డాయి. పోలీసుల తీరుపై ఎంపీ బండి సంజయ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్ల ముందు గుడ్లు విసిరినా పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తన భద్రతను కమలం కార్యకర్తలు చూసుకుంటారని తనతో రావొద్దని బండి సంజయ్‌ పోలీసులను హెచ్చరించారు.  

Bandi Sanjay Comments On BRS : అంతకు ముందు ఆయన మాట్లాడుతూ తమ కుటుంబాల చరిత్రను చెప్పుకునేందుకు కాంగ్రెస్‌, బీఆర్​ఎస్​ మహనీయుల చరిత్రను కనుమరుగు చేసేందుకు యత్నించాయని బండి సంజయ్‌ ఆరోపించారు. కరీంనగర్‌ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఆయన చేపట్టిన ప్రజాహితయాత్రలో హనుమకొండ జిల్లా వంగరలో కొనసాగింది. దివంగత ప్రధాని స్వగ్రామంలో పర్యటించిన బండి సంజయ్‌ పీవీ విగ్రహానికి నివాళి అర్పించారు.  

ABOUT THE AUTHOR

...view details