తెలంగాణ

telangana

X యూజర్స్​కు గుడ్ న్యూస్​ - ఇకపై వారికి 'బ్లూ టిక్' ఫ్రీ ఫ్రీ ఫ్రీ! - Twitter Gives Blue tick for free

By ETV Bharat Telugu Team

Published : Apr 5, 2024, 3:57 PM IST

X Gives Free Blue Check To Big Follower Account Again : ఎక్స్ (ట్విట్టర్​)​ యూజర్లకు గుడ్ న్యూస్​. ఇకపై 2500 కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న ఎక్స్​ యూజర్లకు పూర్తి ఉచితంగా 'బ్లూ టిక్​' లభించనుంది. అంతేకాదు వాళ్లకు ప్రీమియం ఫీచర్లు కూడా లభించనున్నాయి.

Twitter Blue tick for free
X gives free blue check to big follower account again

X Gives Free Blue Check To Big Follower Account Again : అపర కుబేరుడు ఎలాన్ మస్క్​కు సంబంధించిన ఎక్స్​ (ట్విట్టర్) ప్లాట్​ఫామ్​ కొంత మంది యూజర్లకు పూర్తి ఉచితంగా కాంప్లిమెంటరీ 'బ్లూ టిక్​'లను అందిస్తోంది. దీనితో చాలా మంది కన్ఫ్యూజన్​ అవుతున్నారు. ఎందుకంటే, ఎలాన్ మస్క్ 2022లో ట్విట్టర్​ను కొనుగోలు చేసిన తరువాత, యూజర్ల నుంచి నెలకు 8 డాలర్లు చొప్పున వసూలు చేసి, బ్లూ టిక్​​లను ఇవ్వడం మొదలు పెట్టారు.

బ్లూ టిక్​ స్పెషాలిటీ!
ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించిన వారికి ట్విటర్​ వెరిఫికేషన్ బ్యాడ్జ్​ కింద బ్లూ టిక్​లను ఇచ్చేంది. ఇది పూర్తి ఉచితంగా అందించేది. దీనితో సెలబ్రిటీలు, ఇన్​ప్లూయెన్సర్స్​లు, పొలిటీషియన్ల అకౌంట్లకు బ్లూటిక్​ మార్కులు ఉండేవి. కనుక యూజర్లు నిజమైన అకౌంట్లను ఫాలో కావడానికి వీలయ్యేది. కానీ 2022లో ఎలాన్​ మస్క్​ 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్​ను కొనుగోలు చేశారు. తరువాత ఫ్రీగా బ్లూ టిక్స్ ఇవ్వడం మానేశారు. బ్లూ టిక్​ కావాలని అనుకునేవాళ్లు నెలకు స్టార్టింగ్ ఫీజుగా 8 డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

దీనితో పలువురు సెలబ్రిటీల, హై-ప్రొఫైల్​ అకౌంట్లకు ఉన్న బ్లూటిక్​లు పోయాయి. ఇదే అవకాశంగా చాలా ఫేక్​ ఎక్స్​ అకౌంట్లు పుట్టుకొచ్చాయి. ఈ ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసిన వాళ్లు డబ్బులు చెల్లించి బ్లూ టిక్​ కొనుకున్నారు. దీనితో అసలు, నకిలీ ఖాతాల మధ్య తేడా గుర్తించలేక యూజర్లు చాలా తికమకపడడం మొదలైంది.

ఫ్రీగా బ్లూటిక్​!
పరిస్థితి చేయి దాటిపోతుండడం వల్ల ఎలాన్ మస్క్ యూ-టర్న్ తీసుకున్నారు. ఇకపై 2500 మందికంటే ఎక్కువ ఫాలోవర్లు ఉన్న యూజర్లకు పూర్తి ఉచితంగా బ్లూ టిక్ అందిస్తామని స్పష్టం చేశారు. పైగా వాళ్లకు ప్రీమియం ఫీచర్లను కూడా ఫ్రీగా అందిస్తామని తెలిపారు. 5000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న అకౌంట్లకు పూర్తి ఉచితంగా ప్రీమియం ప్లస్ ఫెసిలిటీస్ కల్పిస్తామని గతవారంలో ఆయన పేర్కొన్నారు.

దీనితో బుధవారం అర్ధరాత్రి నుంచి పలువురు ఎక్స్ యూజర్ల అకౌంట్లకు బ్లూటిక్​లను పునరుద్ధరించడం జరిగింది. దీనిపై పలువురు యూజర్లు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బ్లూ టిక్​ మార్క్​ కోసం డబ్బులు కట్టినవాళ్లు మాత్రం ఫ్రస్టేషన్​కు గురవుతున్నారు. అయితే ఈ తాజా పరిణామం గురించి ఎలాన్​ మస్క్ గానీ, అతని అధికారిక ప్రతినిధులు కానీ ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.

పబ్లిక్ కేబుళ్లతో ఫోన్ ఛార్జింగ్ యమా డేంజర్​- ఈ టిప్స్ పాటించకపోతే మీ డేటా అంతా చోరీ! - Public USB Phone Charging problems

మీకు ఈ-వెహికల్ ఉందా? ఛార్జింగ్ టైమ్​లో ఈ టిప్స్ ఫాలో అవ్వండి- లేకుంటే! - EV charging safety guidelines

ABOUT THE AUTHOR

...view details