తెలంగాణ

telangana

సమ్మర్​లో ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా? ఎందుకో తెలుసా? - Summer Effects On Phone Charging

By ETV Bharat Telugu Team

Published : May 2, 2024, 1:58 PM IST

Summer Effects On Phone Charging : దేశంలో ఎండలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. అన్ని ప్రాంతాల్లో గరిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ వేసవి ప్రభావం మనుషుల మీదే కాదు, స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్​పైనా పడుతుంది. వేసవిలో స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ ఎందుకు త్వరగా తగ్గిపోతుంది? కారణమేంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Etv Bharat
Etv Bharat

Summer Effects On Phone Charging :ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవిలో భానుడి ప్రతాపం మనుషుల మీదే కాదు, మనం వాడే స్మార్ట్ ఫోన్ మీద కూడా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఇతర సీజన్లతో పోలిస్తే వేసవిలో స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వేడెక్కుతుంది. బ్రౌజింగ్ చేసినా, గేమ్స్ ఆడినా వెనక ఉండే ప్యానెల్ మొత్తం హీటెక్కుతుంది. అంతేకాదు వేసవిలో స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ వేగంలో కూడా తేడాను మనం గమనించవచ్చు. మునుపటితో పోల్చితే ఛార్జింగ్ వేగం తగ్గుతుంది. ఇంతకు వేసవి కాలంలో ఛార్జింగ్ వేగం ఎందుకు తగ్గుతుంది? వేసవికి, ఛార్జింగ్ మధ్య సంబంధం ఏంటి?

పెరుగుతున్న టెక్నాలజీతో స్మార్ట్ ఫోన్లలో కూడా రకరకాల ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. అవి మరింత పవర్​ఫుల్​గా మారుతున్నాయి. అంతేకాదు వాటి స్పీడ్, పనితీరులో చాలా వరకు మార్పులు వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ వేగం కూడా పెరిగింది. డిస్‌ప్లే బ్రైట్‌నెస్‌ పెరిగింది. ఒకప్పుడు సన్‌లైట్‌లోకి తీసుకెళితే స్మార్ట్‌ఫోన్‌ డిస్‌ప్లే కనిపించేది కాదు. ఇప్పుడు డిస్‌ప్లే బ్రైట్‌నెస్‌ ఆ స్థాయిలో మెరుగైంది. ఇవన్నీ స్మార్ట్‌ఫోన్‌ హీట్‌ను పెంచేవే. దీనికితోడు బీజీఎంఐ వంటి హై ఎండ్‌ గేమ్స్ ఆడడం వల్ల కూడా ఫోన్‌ హీట్‌ పెరుగుతుంది. సాధారణ రోజుల కంటే వేసవిలో వేడిమి కారణంగా స్మార్ట్‌ఫోన్లు మరింత వేగంగా హీటెక్కుతాయి.

ఛార్జింగ్ స్పీడ్ ఎందుకు నెమ్మదిస్తుంది?
స్మార్ట్ ఫోన్ ఫెర్మార్మెన్స్​తో పాటు బ్యాటరీ ఛార్జింగ్ వేగం చాలా వరకు పెరుగుతుంది. నిమిషాల్లోనే బ్యాటరీని ఫుల్ ఛార్జింగ్ చేసే టెక్నాలజీ కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే హీట్ కారణంగా ఫోన్ డ్యామేజీ కాకుండా ఉండేందుకు వీటిలో డిఫెన్స్ మెకానిజం కూడా ఉంటుంది. అంటే స్మార్ట్ ఫోన్ వేడిగా ఉన్నప్పుడు ఇందులోని సెన్సార్లు గుర్తిస్తాయి. అవి ఫోన్ ఛార్జింగ్ స్పీడ్​ను తగ్గిస్తాయి.

ఒక్కోసారి మళ్లీ స్మార్ట్ ఫోన్ ఉష్ణోగ్రత సాధారణ స్థితికి చేరుకునేంత వరకు పూర్తిగా ఛార్జింగ్ కూడా కాదు. ఇలాంటి సందర్భాల్లో ఫోన్ హీటెక్కితే చల్లార్చేందుకు వెనకున్న కేస్​ను తొలగించాలి. ఒకవేళ వైర్ లెస్ ఛార్జర్ వాడుతున్నట్లయితే వైర్ ఛార్జింగ్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవడం బెటర్. ముఖ్యంగా ఛార్జింగ్​లో ఉన్నప్పుడు గేమ్స్​కు ఆడకుండా దూరంగా ఉండాలని సూచిస్తున్నారు సాంకేతిక నిపుణులు.

మండుతున్న ఎండల్లో చల్లచల్లగా కూల్ ​డ్రింక్స్ తాగుతున్నారా? - పొట్టలోకి వెళ్లి ఏం చేస్తాయో మీకు తెలుసా? - Cool Drinks Side Effects in Summer

అలర్ట్ : సమ్మర్​లో ఊటీ, కొడైకెనాల్ వెళ్లే ఆలోచనలో ఉన్నారా? - ఇది తెలుసుకోకపోతే ఇబ్బందులు తప్పవు! - Alert for Ooty Kodaikanal Tourists

ABOUT THE AUTHOR

...view details