తెలంగాణ

telangana

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు - అతివలంతా అగ్రస్థానాన నిలవాలని ప్రముఖుల ఆకాంక్ష

By ETV Bharat Telangana Team

Published : Mar 8, 2024, 9:59 PM IST

Womens Day Celebrations 2024 in Telangana : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అతివలంతా అగ్రస్థానాన నిలవాలని పలువురు ప్రముఖులు కాంక్షించారు. సమాజంలో ఆడవాళ్లు అభివృద్ధి పథంలో నడవాలని, వారికి సగభాగంతోపాటు సమానత్వం అవసరమని భావించారు. గత, ప్రస్తుత ప్రభుత్వాలు సైతం పాలనలో అతివలను అందలమెక్కిస్తున్నామని వెల్లడించాయి.

CM Revanth Reddy Wishes on Women's Day
Womens Day Celebrations in Telangana

రాష్ట్రమంతటా ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు - అతివలంతా అగ్రస్థానాన నిలవాలని ప్రముఖుల ఆకాంక్ష

Womens Day Celebrations 2024 in Telangana : ప్రజాపాలనలో మహిళామణుల ప్రాతినిథ్యం, భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, అన్ని రంగాల్లో మహిళలను అభివృద్ధి, ప్రగతి పథంలో తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోందని తెలిపారు. మహిళల సాధికారితతో(Women Empowerment) పాటు ఆర్థిక స్వాలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

CM Revanth Reddy Wishes on Womens Day : అన్ని రంగాల్లో స్త్రీలకు సమాన అవకాశాలు, సమాన హక్కులు దక్కాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. మహిళల అభ్యున్నతి లక్ష్యంగా రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాల ద్వారా త్వరలోనే మరిన్ని వినూత్న కార్యక్రమాలను చేపడుతామన్నారు. స్త్రీలకు అండగా ఉండేలా తమ ప్రభుత్వం(Congress Govt) మరిన్ని కొత్త పథకాలు అందుబాటులోకి తెస్తుందని తెలిపారు. మహిళా సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం తప్పకుండా దేశమందరి దృష్టిని ఆకర్షిస్తుందనే నమ్మకం తనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు.

రామోజీ ఫిల్మ్‌సిటీలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు - అతివలు ఆకాశమే హద్దుగా ఎదగాలన్న మంత్రి సీతక్క

KTR Wishes Womens Day : పదేళ్ల పాలనలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశామని మాజీమంత్రి, బీఆర్ఎస్​ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ అన్నారు. బీఆర్ఎస్​ పాలనలో అప్పుడే పుట్టిన ఆడబిడ్డ నుంచి, ఆరుపదులు దాటిన అవ్వల వరకు అందరినీ కంటికి రెప్పలా కాపాడామని ఆయన సామాజిక మాధ్యమం (Social Media) ఎక్స్​లో పోస్ట్ చేశారు. మహిళల అభ్యున్నతి కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అలుపెరుగని కృషి చేశారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ భవన్‌లో మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి కేక్ కోసి సంబరాలు చేసుకున్నారు.

3K Walkathon Organize at LB Nagar : హైదరాబాద్​ మహా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో మహిళా పారిశుద్ధ్య కార్మికులు కీలకపాత్ర పోషిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్ అన్నారు. జీహెచ్​ఎంసీ(GHMC) కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మహిళా కార్మికులను సన్మానించారు. మహిళ ఆరోగ్యం, సాధికారత, హక్కుల కోసం హైదరాబాద్‌ ప్రైవేటు హాస్పిటల్ ఆధ్వర్యంలో కొత్తపేట నుంచి ఎల్బీనగర్ చౌరస్తా వరకు 3కే వాకథాన్ నిర్వహించారు.

International Womens Day Celebrations :వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో అటవీశాఖమంత్రి కొండా సురేఖ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రోగుల పట్ల సిబ్బంది బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు. ఆదిలాబాద్‌లో కలెక్టర్ రాజర్షిషా మహిళ అధికారులతో కలిసి వేడుకలు ప్రారంభించారు. పురుషులతో మహిళలు సమానంగా రాణించాలని ఆకాంక్షించారు. నిజామాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ మహిళా దినోత్సవం సందర్భంగా, మహిళల్లో తీవ్రమవుతున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్​పై(Cervical Cancer) మహిళా వైద్యులు, సిబ్బందికి వ్యాక్సిన్‌ ఇప్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో బెల్ట్ షాపులను పూర్తిగా నివారించాలని ప్లకార్డులు పట్టుకొని మహిళలు ప్రతిజ్ఞ చేశారు.

అత్తాకోడళ్లు ఒకరికొకరు తినిపించుకుంటే నో బిల్​! ఉమెన్స్ డే స్పెషల్​ ఆఫర్

అనసూయగా ప్రారంభమై - మంత్రిగా ప్రజల మన్ననలు పొంది - స్ఫూర్తిదాయకం సీతక్క ప్రయాణం

ABOUT THE AUTHOR

...view details