తెలంగాణ

telangana

ఫొటో షూట్​ అని పిలిచి, కెమెరా కోసం చంపేశారు - ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

By ETV Bharat Telangana Team

Published : Mar 3, 2024, 10:17 PM IST

Vishakha Photographer Murder : రూ. 10 లక్షల విలువ చేసే కెమెరా కోసం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్న ఘటన ఏపీలోని డా. బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో గత నెల 29 నుంచి కనిపించకుండాపోయిన యువ ఫోటో గ్రాఫర్ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు విశాఖ జిల్లా ఎస్పీ తెలిపారు.

Vishakha Photographer Murder
Vishakha Photographer Murder

Vishakha Photographer Murder :ఆంధ్రప్రదేశ్​లోనిడా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువ ఫొటోగ్రాఫర్‌ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. జిల్లా రావులపాలెం సమీపంలో ఈ ఘటన జరిగింది. విశాఖ సీపీ రవిశంకర్‌ (Visakha CP Ravi Shankar) తెలిపిన వివరాల ప్రకారం, నగరంలోని మధురవాడ బక్కన్నపాలెం ప్రాంతానికి చెందిన పోతిన సాయి కుమార్‌ (23) పెళ్లి వేడుకలకు వీడియోలు, ఫొటోలు చిత్రీకరణ చేస్తుంటాడు. ఆన్‌లైన్‌ ద్వారా బుకింగ్‌లు తీసుకొని స్థానిక ప్రాంతాలతో పాటు దూర ప్రాంతాలకు కూడా ఈవెంట్‌లకు వెళ్తూ కుటుంబంతో జీవనం సాగిస్తుండేవాడు.

కూలీ కోసం వెళ్లి కానరానిలోకాలకు - మ్యాన్‌హోల్‌లో దిగి ఉపిరాడక ముగ్గురి మృతి

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెం ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులైన షణ్ముఖ తేజ, మరో యువకుడు పది రోజుల ఫొటోషూట్‌ ఉన్నట్లు చెప్పి ఫిబ్రవరి 26న సాయి కుమార్‌ను పిలిచారు. దీంతో తన వద్ద ఉన్న సుమారు 10 లక్షల రూపాయల విలువైన కెమెరా సామగ్రితో అతడు బయలుదేరి వెళ్లాడు. ఫొటోషూట్​కు వెళ్లె ముందు పెళ్లి వేడుకలో ఫొటోల చిత్రీకరణకు రావులపాలెం వెళ్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పాడు.

సాయికుమార్‌ విశాఖలో రైలు ఎక్కి రాజమహేంద్రవరంలో దిగారు. అనంతరం ఇద్దరు యువకులు కారులో వచ్చిఫోటోగ్రాఫర్​ను తీసుకెళ్లారు. ఆ ఇద్దరికి కెమెరా సామగ్రి మీద కన్ను పడింది. దీంతో రావులపాలెం సమీపంలో ఇద్దరు వ్యక్తులు అతడిని హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. అనంతరం కెమెరా, సామగ్రిని నిందితులు పరారైయ్యారు.

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి కేసు - కారు ఢీకొన్న టిప్పర్ ఇదే

మూడు రోజులుగా కుమారుడి ఆచూకీ తెలియకపోవడంతో సాయి కుమార్‌ తల్లిదండ్రులు గత నెల 29వ తేదీన విశాఖలోని పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి ఫోన్‌ కాల్‌డేటా ఆధారంగా నిందితుల్లో ఒకరైన షణ్ముఖ తేజను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. కెమెరా, సామగ్రి కోసమే సాయి కుమార్‌ను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధరణకు వచ్చారు. అనంతరం మరో యువకుడిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతానికి సాయి కుమారు హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు విశాఖ సీపీ రవిశంకర్‌ తెలిపారు.

రెస్టారెంట్​లో చెలరేగిన మంటలు- 45మంది మృతి

ట్రాక్ దాటుతుండగా ప్రయాణికులను ఢీకొట్టిన రైలు​- ఇద్దరు మృతి

ABOUT THE AUTHOR

...view details