తెలంగాణ

telangana

తెలంగాణ ప్రజలకు అలర్ట్ - నేడు ఏడు జిల్లాలకు భారీ వర్ష సూచన - TELANGANA RAIN ALERT TODAY

By ETV Bharat Telangana Team

Published : May 6, 2024, 4:50 PM IST

Updated : May 7, 2024, 9:44 AM IST

Rain Alert in Telangana : రాష్ట్రంలో ఉక్కపోతలతో సతమతమవుతున్న ప్రజలకు హైదరాబాద్​ వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాగల 5 రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో పాటు మరికొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.

IMD Yellow Warnings Issued in Telangana
Telangana Rains (ETV BHARAT)

Telangana Weather Report :రాష్ట్రంలో రాగల ఐదు రోజుల పాటు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదారాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30- 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Telangana Rains: రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40- 50 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు ఇవాళ కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఉపరితల ద్రోణి తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9- కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలో మంగళ, బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మంగళవారం నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ, యాదాద్రి జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.

El Nino Effect in India :భారత్‌లో సరిగ్గా రుతుపవనాల సమయంలోనే ఎల్‌ నినో రావడంవల్ల వర్షపాతం ఆరు శాతం తెగ్గోసుకుపోయిందని ఐఎండీ వెల్లడించింది. ఈ సంవత్సరం ఫిబ్రవరి తరవాత పసిఫిక్‌ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయని, దేశంలో జూన్‌ నాటికి ఎల్‌ నినో ముగిసిపోయి లా నినా ప్రారంభమవుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కానీ, అప్పటికే అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల వల్ల తీవ్రస్థాయి నష్టం వాటిల్లుతుందని భావిస్తున్నారు.

నెత్తిన నిప్పుల కుంపటిగా మారిన భానుడు :ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఉష్ణోగ్రతలు 40-45 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. వేసవిలో వడగాడ్పులు ఇండియాలో సర్వసాధారణం. అయినప్పటికీ, 20వ శతాబ్దంలో ఇవి ఎక్కువయ్యాయని అనేక రిపోర్ట్​లు స్పష్టం చేస్తున్నాయి. గడచిన వందేళ్లలో భారతదేశంలో సగటు వార్షిక ఉష్ణోగ్రతలు 0.66 డిగ్రీల మేర పెరిగాయి. దేశ చరిత్రలో 12 అత్యంత వేడి సంవత్సరాలు 2006 తరవాతే నమోదయ్యాయని వాతావరణ నిపుణులు వివరిస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా 46.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత జగిత్యాల జిల్లాలో నమోదైంది.

పగలు భగభగలు సాయంత్రం పిడుగులు - రాష్ట్రంలో గాలివాన బీభత్సం - UNTIMELY RAINS IN TELANGANA 2024

రాష్ట్రంలో భిన్న వాతావరణం - ఓ వైపు ఎండలు మరోవైపు వర్షాలు - రాగల మూడు రోజులు జాగ్రత్త! - Telangana Weather Report Today

Last Updated : May 7, 2024, 9:44 AM IST

ABOUT THE AUTHOR

...view details