తెలంగాణ

telangana

తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణస్వీకారం - భాగ్యలక్ష్మి, యాదాద్రి ఆలయంలో పూజలు

By ETV Bharat Telangana Team

Published : Mar 20, 2024, 12:05 PM IST

Updated : Mar 20, 2024, 10:07 PM IST

Telangana New Governor CP Radhakrishnan Oath Taking : తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం గవర్నర్‌ కుటుంబసమేతంగా చార్మినార్‌ భాగ్యలక్ష్మి, యాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్నారు.

Telangana New Governor
Telangana New Governor

తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణస్వీకారం

Telangana New Governor CP Radhakrishnan Oath Taking : రాష్ట్ర నూతన గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ (TS Governor CP Radhakrishnan Oath) ప్రమాణస్వీకారం చేశారు. రాధాకృష్ణన్‌తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. ప్రస్తుతం ఝార్ఖండ్‌ గవర్నర్‌గా ఉన్న ఆయన అదనంగా తెలంగాణ బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణస్వీకారం అనంతరం పోలీసుల గౌరవవందనం స్వీకరించారు.

యాదాద్రిని దర్శించుకున్న గవర్నర్

రాష్ట్ర గవర్నర్​గా బాధ్యతలు చేపట్టిన సీపీ రాధాకృష్ణన్ పాతబస్తీలోని చార్మినార్ భాగ్యలక్ష్మి, యాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన గవర్నర్, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు సీపీ రాధాకృష్ణన్‌కు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం అర్చకులు గవర్నర్‌కు తీర్ధ ప్రసాదాలు అందించారు.

చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్

Telangana In Charge Governor 2024 :మరోవైపు పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గానూ సీపీ రాధాకృష్ణన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రానికి మూడో గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ వ్యవహరించనున్నారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి 2019 సెప్టెంబరు 7 వరకు ఈఎస్‌ఎల్‌ నరసింహన్, 2019 సెప్టెంబరు 8 నుంచి ఇప్పటి వరకు తమిళిసై సౌందరరాజన్‌ గవర్నర్‌గా వ్యవహరించారు.

'కేబినెట్‌ నిర్ణయాన్ని గవర్నర్ తిప్పి పంపొచ్చు, తిరస్కరించకూడదు' - హైకోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురు

సీపీ రాధాకృష్ణన్‌ 1957 మే 4న జన్మించారు. తమిళనాడులోని కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి రెండు సార్లు భారతీయ జనతా పార్టీ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ పనిచేశారు. 2016 నుంచి 2019 వరకు ఆల్‌ ఇండియా కాయర్‌ బోర్డ్‌ ఛైర్మన్‌గా సేవలు అందించారు. తమిళనాడు కమలం పార్టీ సీనియర్‌ నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. 2023 ఫిబ్రవరి 18 నుంచి ఆయన ఝార్ఖండ్‌ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ముగ్గురూ తమిళనాడు వారే : ఈ క్రమంలోనే తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గానూ సీపీ రాధాకృష్ణన్​కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అదనపు బాధ్యతలు అప్పగించారు. రెండు చోట్లా పూర్తిస్థాయి గవర్నర్లను నియమించేంత వరకూ ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తారని రాష్ట్రపతి కార్యాలయం మంగళవారం రోజున విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇప్పటి వరకు రాష్ట్ర గవర్నర్లుగా పనిచేసిన ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌, తమిళిసై సౌందరరాజన్‌తోపాటు ప్రస్తుతం బాధ్యతలు చేపట్టిన సీపీ రాధాకృష్ణన్‌ ముగ్గురూ తమిళనాడు వారే కావడం గమనార్హం.

Governor Tamalisai Resigned :మరోవైపు క్రియాశీల రాజకీయాల్లోకి వెళ్లే యోచనతో ఇంతకాలం రాష్ట్ర గవర్నర్‌గా వ్యవహరించిన తమిళిసై సౌందరరాజన్ సోమవారం గవర్నర్‌ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆమె లేఖ పంపారు. మంగళవారం నాడు రాష్ట్రపతి తమిళిసై రాజీనామాను ఆమోదించారు.

'మా భవిష్యత్తు, జీవితాలు నాశనం చేశారు'- తమిళిసైకి దాసోజు శ్రవణ్​ బహిరంగ లేఖ

Last Updated : Mar 20, 2024, 10:07 PM IST

ABOUT THE AUTHOR

...view details