తెలంగాణ

telangana

గ్రూప్‌-1 అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌ - మరో 60 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్

By ETV Bharat Telangana Team

Published : Feb 6, 2024, 3:34 PM IST

Updated : Feb 6, 2024, 5:33 PM IST

Telangana Govt has Increased 60 Group-1 Posts : మరో 60 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. వీలైనంత త్వరగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీకి ప్రభుత్వం తెలిపింది. గతంలో 503 గ్రూప్‌ -1 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఇప్పుడు మరో 60 గ్రూప్‌-1 పోస్టులను పెంచింది.

TSPSC Group 1
Telangana Govt has Increased 60 Group-1 Posts

Telangana Govt has Increased 60 Group-1 Posts :గ్రూప్‌-1 పోస్టులను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరో తొమ్మిది శాఖల్లో 60 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. కొత్తగా అనుమతిచ్చిన ఉద్యోగాల్లో 24 డీఎస్పీ, 19 ఎంపీడీవో, నాలుగు అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెంటెండ్‌, మూడు డిప్యూటీ సూపరింటెంటెండ్‌ ఆఫ్‌ జైల్స్‌, మూడు జిల్లా ఎంప్లాయిమెంట్‌ అధికారి, మూడు డిప్యూటీ కలెక్టర్‌, రెండు జిల్లా పంచాయతీ అధికారి, ఒక అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌, ఒక జిల్లా రిజిస్ట్రార్‌ పోస్టులు ఉన్నట్లు సర్కార్‌ స్పష్టం చేసింది. త్వరగా గ్రూప్‌ -1కు సంబంధించిన నోటిఫికేషన్‌, షెడ్యూల్‌ను జారీ చేసి నియామక ప్రక్రియ ప్రకటించాలని టీఎస్‌పీఎస్సీ(TSPSC)ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

2022లో వివిధ శాఖల్లోని 503 పోస్టుల కోసం టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అదే ఏడాది అక్టోబరు 16న ప్రిలిమినరీ నిర్వహించగా, ప్రశ్నపత్రం లీక్‌ కావడంతో పరీక్ష రద్దయింది. గతేడాది జూన్‌ 11న మరోసారి నిర్వహించిన ప్రిలిమ్స్‌ను హైకోర్టు రద్దు చేసింది. మళ్లీ టీఎస్‌పీఎస్సీ ఈ పరీక్షను నిర్వహించాలని ఆదేశించింది. ప్రభుత్వం మారిన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు మళ్లీ పరీక్ష నిర్వహిస్తారా లేక సుప్రీంకోర్టులో కేసు కొనసాగిస్తారా తేలాల్సి ఉంది.

గ్రూప్‌-1 ప్రకటనపై కొత్త ప్రభుత్వం నిర్ణయమే కీలకం - మరీ చిక్కుముడి వీడేదెలా?

Telangana Group-1 Posts :2022లో వివిధ శాఖల్లోని 503 పోస్టుల భర్తీ కోసం పరీక్ష నిర్వహించిన టీఎస్‌పీఎస్సీ, కొత్త పోస్టులతో తాజా నోటిఫికేషన్‌ ఇవ్వాలా లేక అనుబంధ ప్రకటన జారీ చేయాలా అనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అదే విధంగా కొత్తగా 60 ఉద్యోగాలకు తాజాగా నోటిఫికేషన్‌ ఇవ్వాలా లేక గత పోస్టులతో జత చేసి అనుబంధ నోటిఫికేషన్‌ జారీ చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలా అనే విషయంపై టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

మరోవైపు మహిళలకు వర్టికల్‌ రిజర్వేషన్‌ విధానం అనుసంరించాలని గత ప్రభుత్వం నిర్ణయించగా, హైకోర్టు(Telangana High Court) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో హారిజాంటల్‌ రిజర్వేషన్‌ అనుసరిస్తే న్యాయ వివాదాలు ఉండవని కొత్త ప్రభుత్వం భావిస్తోంది. మహిళలకు రిజర్వేషన్‌ విధానం, గ్రూప్‌-1 పరీక్ష తదితర కీలక విషయాలపై ప్రభుత్వం తుది నిర్ణయాలు తీసుకున్న తర్వాత టీఎస్‌పీఎస్సీ ముందడగు వేసే అవకాశం ఉంది.

High Court on GROUP-1 Prelims : 'పరీక్షల నిర్వహణలో కీలక అంశాలను ఎందుకు విస్మరించారు'

టీఎస్‌పీఎస్సీ నూతన ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌ రెడ్డి!

Last Updated : Feb 6, 2024, 5:33 PM IST

ABOUT THE AUTHOR

...view details