ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గిరిజన గ్రామాలకు లేని రహదారి సౌకర్యం - సకాలంలో వైద్యం అందక మృత్యు ఘోష

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 23, 2024, 3:01 PM IST

Updated : Jan 23, 2024, 3:45 PM IST

Lack of Road Facilities in Tribal Areas : అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజనులకు డోలిమోతలు తప్పడం లేదు. సకాలంలో వైద్యం అందక రోగులు, బాలింతలు మృత్యువాతపడుతున్నారు. తమ గ్రామాలకు రహదారుల సౌకర్యం కల్పించాలని గిరిజనులు డిమాండ్​ చేస్తున్నారు.

Etv Bharat
Etv Bharat

గిరిజన గ్రామాలకు లేని రహదారి సౌకర్యం - సకాలంలో వైద్యం అందక మృత్యు ఘోష

Lack of Road Facilities in Tribal Areas :దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా వారి జీవితాల్లో ఇంకా వెలుగులు రావడం లేదు. యావత్తు ప్రపంచం ఆధునికతలో ముందుకు దూసుకు వెళ్తున్న వారు మాత్రం ఇంకా వెనకబడే ఉన్నారు. మారుమూల ప్రాంతాల్లో నివసిస్తూ సరైన రహదారి సౌకర్యం లేక కొండల మధ్య బాధితులను డోలిమోతల్లో ఆసుపత్రికి తరలిస్తున్న వారి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. గిరిజనులకు సకాలంలో సరైన వైద్యం అందక మృత్యు ఘోషలు వినిపిస్తూనే ఉన్నాయి. వారి జీవితాల్లో వెలుగులు తీసుకురావలసిన అధికార ప్రభుత్వం తమకు ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తోంది.

ముక్కలుగా మారి మూల్గుతున్న మంగళగిరి వైఎస్సార్​సీపీ - ఆదిపత్యపోరుతో పెరుగుతున్న అసమ్మతి

Alluri Sitaramaraju District : మారుమూల గ్రామాల్లో జీవిస్తున్న గిరిజనులు దశాబ్దాలుగా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన రవాణా సదుపాయాల్లేక అత్యవసర వైద్యానికి ఆసుపత్రులకు వెళ్లేందుకు ప్రాణాప్రాయ పరిస్థితులను చవి చూస్తున్నారు. తాజాగా మన్యంలో డోలీ మోతలు నిత్యకృత్యమవుతున్నాయి. ప్రసవ వేదనతో బాధపడుతున్న నిండు గర్భిణిని డోలీమోతతో ఆసుపత్రికి తరలించిన సంఘటన అనంతగిరి మండలంలో చోటు చేసుకుంది. పినకోట పంచాయతీ రాచకిలానికి చెందిన చిన్నాలమ్మ అనే గర్బిణీని 8 కిలోమీటర్లు డోలి మోత మోసి ఆస్పత్రికి తరలించారు. గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో అంబులెన్సు వచ్చే అవకాశం లేక తమకు డోలిమోతలు తప్పడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఒక్క వారంలోనే తమ గ్రామానికి చెందిన ముగ్గురిని ఇదే విధంగా ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. రహదారి సౌకర్యం లేని కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

Child with Proper Treatment Death : సరైన రహదారులు లేకపోవడంతో బాధితులను ఆసుపత్రికి చేర్చలోపు కొందరి ప్రాణాలు పోతుంటే, మరికొందరు చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఇలాంటి సంఘటనే విజయనగరం జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో జరిగింది. మూలబొడ్డవరలో ఆదివారం (జనవరి 21న) ఓ చిన్నారిని 7 కిలోమీటర్లు డోలిలో తీసుకెళ్లినా సకాలంలో వైద్యం అందక మరణించింది. మృత్యవాత పడిన చిన్నారి తల్లి ఆవేదన అరణ్య వేదనగా మారింది.

Carrying The Dead Dody On Doli : మన్యంలో తప్పని డోలి మోతలు.. డోలీలో మృతదేహం తరలింపు

Tribal People Demand for Road : అనంతగిరి మండలంలో పెదకోట, పినకోట, జీనపాడు పంచాయతీ పరిధిలో 2 వేల మంది గిరిజనులు ఆవాసం ఉంటున్నారు. తమ గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని అధికారులను ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా ప్రయోజనం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ రహదారిని తమ ప్రాంతాలను మంజూరు చేసినా మధ్యలోనే నిర్మాణ పనులు నిలిపివేస్తున్నారని స్థానికులు తెలిపారు. రహదారి నిర్మాణ పనులు మధ్యలో నిలిపివేయటంపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని గిరిపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గిరిజన గ్రామాలకు కనీసం మెటల్​ రోడ్డయినా వేసే విధంగా చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.

Last Updated :Jan 23, 2024, 3:45 PM IST

ABOUT THE AUTHOR

...view details