ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దొరికినంత దోచుకో - పంచుకో - విశాఖలో వైఎస్సార్సీపీ నేతల భూకబ్జాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 16, 2024, 2:55 PM IST

Huge Land Kabza By YSRCP Leaders in Visakhapatnam : రాష్ట్రంలో అధికార పార్టీ ప్రతినిధులు దొరికినంత దోచుకో, దోచుకుంది పార్టీ బలగాలతో పంచుకో అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఎక్కడ పోరంబోకు భూమి ఉన్నా దాన్ని గద్దలా వచ్చి తన్నుకుపోతున్నారు. లే అవుట్ల పేరుతో వసూళ్లు, ఇసుక మైనింగ్​లు, గ్రావెల్​ దోపిడీ, భూ కుంభకోణాలు ఇవీ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నేతల ఉద్యోగాలు. ఎంతో నిబద్ధతో చేసే పనులు. కట్టుబడి చేసే కబ్జాలు.

huge_land_kabza_by_ysrcp_leaders_in_visakhapatnam
huge_land_kabza_by_ysrcp_leaders_in_visakhapatnam

దొరికినంత దోచుకో - పంచుకో - విశాఖలో వైఎస్సార్సీపీ నేతల భూకబ్జాలు

Huge Land Kabza By YSRCP Leaders in Visakhapatnam :విశాఖ జిల్లా ఆనందపురం మండలం వేములవలస రెవెన్యూ గ్రామ పరిధిలో సుమారు 8.52 ఎకరాల ప్రభుత్వ భూమిని తమ గుప్పెట్లోకి తీసుకునేందుకు వైఎస్సార్సీపీ నాయకులు ప్రణాళిక రచించారు. జాతీయ రహదారి చెంతనే అధికార అండతో కబ్జాకు వ్యూహ రచన చేశారు. ప్రభుత్వం ప్రకటించిన డి-పట్టాల క్రమబద్ధీకరణ అస్త్రాన్ని తెరపైకి తెచ్చారు. ఇక్కడ ఎకరా ధర దాదాపు రూ. 10 కోట్లపైనే పలుకుతుండగా దాదాపు రూ. 100 కోట్ల భూమిపై కన్నేశారు. అక్రమార్కులకు కొందరు అధికారుల సహకారం ఉన్నట్లు సమాచారం.

రౌడీల్ని అడ్డం పెట్టుకుని స్థిరాస్తి వ్యాపారం - విశాఖలో పేట్రేగిపోతున్న వైసీపీ నేత

YSRCP Leaders Illegal Land Grab in Visakha :వారం రోజులుగా సర్వే నెంబరు 129లో భారీ యంత్రాలతో చదును చేయడం, చుట్టూ రక్షణగా స్తంభాలు ఏర్పాటు చేయడంతో పాటు రేకుల షెడ్డు నిర్మాణం జరిగింది. దీన్ని కొందరు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వారికి నోటీసులు జారీ చేస్తామని తహసీల్దార్‌ చెప్పినా ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. జల ప్రవాహానికి సంబంధించిన గెడ్డవాగును పూర్తిగా చదును చేసి, స్వరూపాన్ని మార్చేస్తుంటే రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. స్థలాన్ని, సంబంధిత భూ దస్త్రాలను సిబ్బంది పరిశీలించారన్న ఆనందపురం తహసీల్దార్‌ హేమంత్‌కుమార్‌ భూమి పూర్తిగా ప్రభుత్వ గెడ్డవాగు, గెడ్డ పోరంబోకు భూమిగా ఉందన్నారు. ప్రభుత్వ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు.

ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా - వివాదాలుంటే సెటిల్మెంట్ ! మాట వినికపోతే బదిలీలు, కేసులు - తండ్రి అడుగు జాడల్లో కుమారుడి అక్రమాలు!

YSRCP Leaders Illegal Activities in state :డి-నోటిఫికేషన్‌ ద్వారా డి-పట్టాలకు పూర్తి హక్కులు కల్పిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే అదనుగా దళారులు రంగ ప్రవేశం మొదలయ్యింది. వేములవలస సహా, మండల పరిధిలో పలు గ్రామాల్లో డి-పట్టా భూముల కొనుగోలు ప్రక్రియ జోరందుకుంది. ఈ క్రమంలో రెవెన్యూ దస్త్రాలపై అవగాహన కల్గిన ఓ రాజకీయ నాయకుడు గతంలో సృష్టించిన పట్టాలతో సర్వే చేయించారు. దీంతో అప్పటి వరకు అందరికి చెరువుగా తెలిసిన భూమి కాస్తా డి-పట్టాగా చెప్పుకొచ్చారు. రాత్రికి రాత్రే ఆ నేలను చదును చేసి చుట్టూ ప్రహరీ కట్టి అందులో మొక్కలు నాటేశారు. ఈ వ్యవహారంలో ఆనందపురం మండలానికి చెందిన ఇద్దరు కీలక నేతల పేర్లు తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.

'వైసీపీ ఎమ్మెల్యే అనుచరుల భూ కబ్జా' - కోర్టుకు వెళ్లాక అదృశ్యమైన బాధితుడు : సోదరుడి ఫిర్యాదుతో వెలుగులోకి

ABOUT THE AUTHOR

...view details