తెలంగాణ

telangana

సూర్య హత్య కేసు నిందితుడు భానుకిరణ్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు - Maddelacheruvu Suri murder case

By ETV Bharat Telangana Team

Published : May 2, 2024, 7:36 PM IST

Maddelacheruvu Suri Murder Case in AP: ఆంధ్రప్రదేశ్‌లోని సూరి హత్య కేసు నిందితుడు భానుకిరణ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. నాంపల్లి కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తు భానుకిరణ్‌ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన కోర్టు కింది కోర్టు తీర్పును సమర్థించింది. భానుకిరణ్‌ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు యావజ్జీవ శిక్షను అమలు చేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Maddelacheruvu Suri murder case in AP
Maddelacheruvu Suri murder case in AP (ఈటీవీ భారత్‌)

Maddelacheruvu Suri Murder Case in AP :ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో పరిటాల రవి హత్య కేసులో నిందితుడైన గంగుల సూర్యనారాయణరెడ్డి అలియాస్‌ మద్దెలచెరువు సూరి హత్య కేసులో యావజ్జీవ శిక్ష పడిన ఎం. భానుకిరణ్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు అయింది. భాను హైకోర్టులో దాఖలు చేసిన అప్పీలులో బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. నాంపల్లి కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది.

భానుకిరణ్ పిటిషన్‌ను పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు నేడు తీర్పు వెలువరించింది. మద్దెల చెరువు సూరి హత్య కేసులో భానుకిరణ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 2011 జనవరి 4వ తేదీన సూరిని హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ నవోదయ కాలనీలో సూరిని, భానుకిరణ్ కాల్చి చంపాడు. ఈ కేసు విచారించిన నాంపల్లి కోర్టు 2018 డిసెంబర్‌లో భానుకిరణ్‌కు జీవితఖైదు విధించింది. నాపంల్లి కోర్టు విధించిన జీవితఖైదును సవాల్‌ చేస్తూ భానుకిరణ్‌ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే, తెలంగాణ హైకోర్టు సైతం నాంపల్లి కోర్టు జీవితఖైదు విధించడాన్ని సమర్థిస్తూ ఉత్తర్వులు వెలువరించింది.

నీ చిన్నానను చంపిన వాళ్లని పక్కన పెట్టుకుని - వారికే ఓటు వేయమని ఎలా అడుగుతున్నావు : సునీత - Sunita Requested Not To Vote YSRCP
నన్ను చంపేందుకు విశాఖలో కుట్ర జరుగుతుంది - జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు
2011లో మద్దెలచెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడైన భానుకు యావజ్జీవ శిక్ష విధిస్తూ 2018 డిసెంబరులో కింది కోర్టు ఇచ్చిన తీర్పు వెలువరించింది. దీనిపై భాను హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. అప్పీలుపై విచారణలో జాప్యం జరుగుతుండటంతో 12 ఏళ్లుగా జైలులో మగ్గుతున్నానని, బెయిల్‌ మంజూరు చేయాలంటూ భాను హైకోర్టును కోరారు. సూరిని తాను హత్య చేయలేదని, పోలీసులు తప్పుడు సాక్ష్యాధారాలు సమర్పించారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు.

చేయని తప్పునకు జైల్లో ఉన్నారని బెయిల్ మంజూరు చేయాలని కూడా కోర్టును కోరారు. అందరి ముందు సూరి తరచూ తిట్టడంతోనే కక్ష్య పెంచుకున్న భానుకిరణ్ హత్య చేసినట్లు ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు ఇదివరకే ముగిశాయి. భానుకిరణ్ పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది.
సీఎం జగన్​కు దెబ్బతగిలితే ఏపీకీ గాయమైనట్లా? : పవన్​ కల్యాణ్ - Pawan Kalyan Speech at Tenali

ABOUT THE AUTHOR

...view details