తెలంగాణ

telangana

రాహిల్‌ కేసు వ్యవహారం - జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులోనూ నిందితుడు - raheel Jubilee Hills Accident case

By ETV Bharat Telangana Team

Published : Apr 13, 2024, 10:43 PM IST

Former MLA Shakeel Son Rahil Case Update : బోధన్​ మాజీ ఎమ్మెల్యే కుమారుడు రాహిల్‌ కేసులో మరో ట్విస్ట్​ వెలుగులోకి వచ్చింది. 2022లో జరిగిన జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో రాహిల్​​ను ఈనెల 18 వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు పోలీసులకు ఆదేశించింది. పంజాగుట్టలో జరిగిన రోడ్డు ప్రమాదంలాగే జూబ్లీహిల్స్ కేసులోనూ మరో వ్యక్తిని డ్రైవర్​గా రాహిల్‌ పంపించాడని పోలీసులు దర్యాప్తులో తేల్చారు.

Rahil Granted Conditional Bail
Former MLA Shakeel Son Rahil Case Update

Former MLA Shakeel Son Rahil Case Update :గత జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్​ కుమారుడు రాహిల్​ను ఈనెల 18 వరుకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. పంజాగుట్ట రోడ్డు ప్రమాదం కేసులో రాహిల్​కు బెయిల్ రావడంతో గత వారం చంచల్​గూడ జైలు నుంచి విడుదల అయ్యాడు. 2022లో జరిగిన జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసును పోలీసులు రీ ఓపెన్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో బాధితుల నుంచి మరోసారి వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు.

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ప్రమాదం మాదిరిగానే జూబ్లీహిల్స్ కేసులోనూ మరో వ్యక్తిని డ్రైవర్​గా రాహిల్ పంపించాడని పోలీసుల దర్యాప్తులో తెలింది. ఈ కేసులో ఓ చిన్నారి మృతి చెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. దీంతో ఈ కేసు దర్యాప్తు చేసిన అప్పటి పోలీస్ అధికారుల వాంగ్మూలాన్ని ఉన్నతాధికారులు నమోదు చేశారు. అప్పటి పోలీసులు రాహిల్​ను తప్పించే ప్రయత్నం చేసినట్లు ఉన్నతాధికారుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. వారి పాత్ర ఉన్నట్లు తేలితే అప్పటి జూబ్లీహిల్స్ పోలీసులపై అధికారులు చర్యలు తీసుకోనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Rahil Granted Conditional Bail : గతేడాది డిసెంబర్‌లో ప్రజా భవన్‌ వద్ద బారికేడ్లను ఢీకొట్టిన కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న రాహిల్‌ను ఈ నెల 8న పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రమాదం తర్వాత దుబాయ్‌ పారిపోయిన అతడు, దుబాయ్‌(Dubai) నుంచి హైదరాబాద్‌కు రాగానే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా, న్యాయస్థానం అతడికి ఈ నెల 22 వరకు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. అయితే రాహిల్‌ను 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పంజాగుట్ట పోలీసులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

మరోవైపు సాహిల్​ సైతం బెయిల్​ పిటిషన్​ దాఖలు చేశారు. కస్టడీ, బెయిల్​ పిటిషన్లపై ఈనెల 10న వాదనలు విన్న న్యాయస్థానం, కస్టడీ పిటిషన్‌ను కొట్టివేస్తూ, రాహిల్‌కు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు తీర్పు వెలువరించింది. రూ.20 వేలు, 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను పాటించాలని అతడికి సూచించింది.

ఒక్కడిని తప్పించబోయి 15 మంది కటకటాల్లోకి :రోడ్డు ప్రమాదం కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత నోటీసులతో వదిలిపెట్టే కేసు కాస్తా నిందితుడు తన తండ్రి పలుకుబడితో బయటపడేందుకు చేసిన ప్రయత్నంతో ఇంత దాకా వచ్చింది. ఇద్దరు సీఐలు సహా 15 మందిని కటకటాల్లోకి నెట్టింది. తాజాగా 2022లో జరిగిన జూబ్లీహిల్స్(Jubilee Hills) రోడ్డు ప్రమాదం కేసును పోలీసులు రీ ఓపెన్ చేసి దర్యాప్తు చేస్తుండడంతో మలుపులు తిరుగుతోంది.

రాహిల్‌కు ఊరట - కస్టడీ పిటిషన్ కొట్టివేత - షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు - bail granted to rahil

మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్​ అరెస్ట్ - ఈ నెల 22 వరకు జ్యుడీషియల్ రిమాండ్ - Ex MLA Shakeel Son Sahil Arrest

ABOUT THE AUTHOR

...view details