తెలంగాణ

telangana

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు సీపీఎం అంగీకారం : సీఎం రేవంత్ రెడ్డి - CPM leaders meet CM Revanth

By ETV Bharat Telangana Team

Published : Apr 27, 2024, 2:04 PM IST

CPM Announces Support by Congress : హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సీపీఎం నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు తాజా రాజకీయాలపై చర్చించారు. తమ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు వారు అంగీకరించారని సీఎం పేర్కొన్నారు. బీజేపీ, ఇతర శక్తులు అడ్డుకునేందుకు కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వివరించారు.

Etv Bharat
Etv Bharat

CPM Leaders Meet CM Revanth : భువనగిరి పార్లమెంట్‌తో పాటు ఇతర పార్లమెంటు స్థానాల్లో మద్దతు ఇవ్వాలని సీపీఎంను కోరామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఆ పార్టీ నాయకులతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సీఎం వెల్లడించారు. ఇవాళ ఉదయం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, వీరయ్య తదితరులు రేవంత్‌రెడ్డితో సమావేశం అయ్యారు.

CPM Announces supported by Congress : ఈ సందర్భంగా సీపీఎం నాయకులు తమ ఎదుట కొన్ని రాజకీయ ప్రతిపాదనలు పెట్టారని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. బీజేపీ శక్తులను ఓడించేందుకు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చేందుకు వారు అంగీకరించినట్లు తెలిపారు. వారితో దేశంలోని ఇండియా కూటమితో కలిసి పని చేయనున్నామని పేర్కొన్నారు. స్థానికంగా కొన్ని అంశాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నా, అందరం కలిసి ముందుకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నామని రేవంత్‌రెడ్డి వివరించారు.

పదేళ్ల కేసీఆర్‌ హయాంలో రాష్ట్రం నాశనమైంది - ఒక్కో పనిని చక్కదిద్దుతూ వస్తున్నాం : సీఎం రేవంత్ ​రెడ్డి - CM Revanth Reddy Election Campaign

రేపటిలోగా ఏకాభిప్రాయానికి వస్తాం : మంచి వాతావరణంలో చర్చలు జరిగాయని రేవంత్‌ రెడ్డి చెప్పారు ఒకట్రెండు విషయాల్లో కొంత సందిగ్ధత ఉన్నా అధిష్టానంతో చర్చించి రేపటిలోగా ఏకాభిప్రాయానికి వస్తామని వివరించారు. సీపీఎం సహకారంతో భవిష్యత్‌లో ముందుకెళ్తామని అన్నారు. ఈ కలయిక రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపునకు పని చేస్తుందని భావిస్తున్నట్లు రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు సీపీఎం అంగీకారం : సీఎం రేవంత్ రెడ్డి

"సీపీఎం నేతలు మా ఎదుట కొన్ని రాజకీయ ప్రతిపాదనలు పెట్టారు. బీజేపీ శక్తులను ఓడించేందుకు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చేందుకు వారు అంగీకరించారు. వారితో దేశంలోని ఇండియా కూటమితో కలిసి పని చేయనున్నాం. స్థానికంగా కొన్ని అంశాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నా, అందరం కలిసి ముందుకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నాం." - రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి

రాష్ట్రంలో, దేశంలో ప్రస్తుతం ఉన్న తాజా రాజకీయాలపై చర్చించామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. తమ పార్టీ అభ్యర్థులను విరమించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరినట్లు పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. బీజేపీ, ఇతర శక్తులను అడ్డుకునేందుకు హస్తం పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని తమ్మినేని వీరభద్రం వెల్లడించారు.

"రాష్ట్రంలో, దేశంలో ప్రస్తుతం ఉన్న తాజా రాజకీయాలపై చర్చించాం. భువనగిరి సీటు విషయంలో సీపీఎంకు మద్దతు ఇవ్వాలని రేవంత్‌ రెడ్డిని కోరాం. భువనగిరి సీటుపై సందిగ్ధత ఉన్నా, మా మద్దతు కాంగ్రెస్‌కు ఉంటుంది. ఎందుకంటే బీజేపీ, ఇతర శక్తులను అడ్డుకోవడమే మా ముఖ్య ఉద్దేశం" - తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి

కాంగ్రెస్ ఇచ్చిన ప్రభుత్వ సంస్థలను మోదీ అమ్మేశారు : సీఎం రేవంత్​ రెడ్డి - CM Revanth on Modi and KCR

'రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర - రాజ్యాంగంపై మోదీ సర్కార్​ ఆఖరి యుద్ధం ప్రకటించింది' - T CONGRESS CHARGE SHEET AGAINST BJP

ABOUT THE AUTHOR

...view details