తెలంగాణ

telangana

మహిళా క్రికెటర్లతో అసభ్య ప్రవర్తన - కోచ్​ను పదవి నుంచి తప్పించిన హెచ్​సీఏ

By ETV Bharat Telangana Team

Published : Feb 16, 2024, 11:57 AM IST

Updated : Feb 16, 2024, 12:45 PM IST

Women Cricketers Complaint against Coach jai Simha : కోచ్‌ జైసింహాపై మహిళా క్రికెటర్లు హెచ్‌సీఏకు ఫిర్యాదు చేశారు. తమతో అసభ్యంగా ప్రవర్తించాడని అందులో పేర్కొన్నారు. దీంతో కోచ్​ జైసింహా తీరుపై హైదరాబాద్​ క్రికెట్​ అసోసియేషన్​ ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే కోచ్​ పదవి నుంచి తప్పుకోవాలని హెచ్​సీఏ అధ్యక్షుడు జగన్​మోహన్​ రావు ఆదేశించారు.

Hyderabad Cricket Association Fire on Coach Jai Simha
Coach Jai Simha Suspend

Women Cricketers Complaint against Coach jai Simha: మహిళా క్రికెటర్లతో కోచ్ విద్యుత్ జైసింహా అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జైసింహా తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళల జట్టు హెడ్ కోచ్​గా ఉన్న జైసింహాపై వేటు వేసింది. గత నెలలో హైదరాబాద్ నుంచి విజయవాడకు మ్యాచ్ ఆడేందుకు హైదరాబాద్ మహిళల జట్టు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో విమానంలో రావాల్సి ఉండగా, కోచ్ జైసింహా ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేశారని ఆరోపణలు వచ్చాయి. అదే కాకుండా ఆలస్యం అయినందున బస్​లో హైదరాబాద్​కు వచ్చే క్రమంలో మహిళా క్రికెటర్ల ముందే జైసింహా మద్యం సేవించి వాళ్లతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు ఉన్నాయి.

హెచ్‌సీఏ అక్రమాలపై రంగంలోకి దిగిన ఈడీ - మాజీ అధ్యక్షుడు వినోద్‌కు నోటీసులు

HCA Fire on Coach Jai Simha: జై సింహా(Coach Jai Simha)కు బస్​లోనే ఉన్న సెలక్షన్ కమిటీ మెంబర్ పూర్ణిమ రావు మద్దతు తెలిపినట్లు మహిళా క్రికెటర్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్​కు ఫిర్యాదు చేశారు. కోచ్ మద్యం సేవిస్తున్న వీడియోలను చిత్రీకరించిన మహిళా క్రికెటర్లు, హెచ్​సీఏకు గత నెల 12న ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఇవాళ్టి వరకు ఈ విషయం వెలుగులోకి రాలేదు. హెచ్​సీఏ కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. కోచ్​ మద్యం సేవిస్తూ కనిపించిన వీడియోలు వాట్సాప్, టీవీ ఛానెళ్ల‌ల్లో ప్ర‌త్య‌క్ష‌మ‌వ‌డంతో అత‌డిపై త‌క్ష‌ణం వేటు వేస్తున్న‌ట్టు హెచ్‌సీఏ(HCA) అధ్య‌క్షుడు జ‌గ‌న్‌మోహ‌న్ రావు ఉత్త‌ర్వులు జారీ చేశారు. వేధింపులకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.

Women Cricketers Complaint against Coach jai Simha

అండర్-19 ఆసియా కప్ 2023 జట్టును ప్రకటించిన బీసీసీఐ- HCA​ నుంచి ఇద్దరు

Coach Jai Simha Reaction on Suspend : ఈ ఘటనపై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు చేసి, స‌దురు కోచ్‌పై త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఉత్త‌ర్వుల్లో హెచ్​సీఏ అధ్యక్షుడు జగన్​మోహన్​ ​రావు పేర్కొన్నారు. ఇలాంటి చ‌ర్య‌లు ఉపేక్షించ‌బోమ‌ని స్పష్టం చేశారు. తనపై వస్తున్న ఆరోపణలను విద్యుత్ జైసింహా ఖండించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని పేర్కొన్నారు.

"మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం కలిగితే ఉపేక్షించేది లేదు. మహిళా క్రికెటర్ల కోచ్ జైసింహాను సస్పెండ్ చేస్తున్నాం. విచారణ ముగిసే వరకు జైసింహాను తప్పిస్తున్నాం. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తాం. వేధింపులకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతాం. మహిళా క్రికెటర్లకు హెచ్‌సీఏ అండగా ఉంటుంది."- జగన్మోహన్‌రావు,హెచ్‌సీఏ అధ్యక్షుడు

మహిళా క్రికెటర్లతో అసభ్య ప్రవర్తన కోచ్​ను పదవి నుంచి తప్పించిన హెచ్​సీఏ

Hyderabad Cricket Association Elections Winner : హైదరాబాద్​ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా జగన్‌మోహన్‌రావు

Last Updated :Feb 16, 2024, 12:45 PM IST

ABOUT THE AUTHOR

...view details