తెలంగాణ

telangana

గంటపాటు గాల్లో చక్కర్లు - సురక్షితంగా ల్యాండైన వాయుసేన విమానం

By ETV Bharat Telangana Team

Published : Mar 1, 2024, 4:36 PM IST

Updated : Mar 1, 2024, 8:23 PM IST

A Technical Glitch in an Air Force Flight At Begumpet Airport : సాంకేతిక లోపంతో గంట పాటు గాల్లోనే చక్కర్లు కొట్టి, బేగంపట విమానాశ్రయంలో వాయుసేన విమానం సురక్షితంగా ల్యాండ్​ అయింది. హైడ్రాలిక్​ వింగ్స్​ మూసుకోకపోవడంతో గాల్లోనే విమానం చక్కర్లు కొట్టింది. చివరికి ముందు వైపు వీల్స్​ మూసుకోవడంతో మొత్తం 16 మంది సురక్షితంగా బయటపడ్డారు.

Technical Fault in Secunderabad Airforce Training Aircraft
Technical Fault in Secunderabad Airforce Training Aircraft

గంటపాటు గాల్లో చక్కర్లు - సురక్షితంగా ల్యాండైన వాయుసేన శిక్షణ విమానం

A Technical Glitch in an Air Force Flight At Begumpet Airport :సాంకేతిక లోపంతో గంట పాటు గాల్లోనే చక్కర్లు కొట్టి బేగంపేట విమానాశ్రయంలో వాయుసేన(Air Froce) విమానం సురక్షితంగా ల్యాండ్​ అయింది. హైడ్రాలిక్​ వింగ్స్​ మూసుకోకపోవడంతో గాల్లోనే విమానం(Aircraft) చక్కర్లు కొట్టింది. చివరికి ముందు వైపు వీల్స్​ మూసుకోవడంతో సురక్షితంగా కిందకు దిగింది. దీంతో అక్కడున్న సిబ్బంది, విమానంలో ఉన్న ఇద్దరు పైలెట్లు, 14 మంది సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

వివరాల్లోకి వెళితే హైదరాబాద్‌ నుంచి కొచ్చి బయలుదేరిన వాయుసేన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. విమానం ముందు వైపు ఉండే హైడ్రాలిక్​ వీల్స్​ మూసుకోలేదు. దీంతో పైలెట్లు ఈ విషయాన్ని ఏటీసీ, ఎయిర్​పోర్టు అథారిటీ అధికారులకు తెలిపారు. ముందు జాగ్రత్తగా విమానాశ్రయ అధికారులు అగ్నిమాపక సిబ్బందితో పాటు అంబులెన్స్​, డీఆర్​ఎఫ్(RDF)​ సిబ్బందిని అప్రమత్తం చేశారు. వారంతా విమానాశ్రయానికి చేరుకొని అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో వాయుసేన విమానం కిందకు దించితే పేలిపోయే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేశారు. వ్యూయల్​ కొంత మేరకు అయిపోయేదాకా గాలిలో చక్కర్లు కొట్టిన తర్వాత విమానాశ్రయం రన్​వేపై సురక్షితంగా విమానం ల్యాండ్​ చేయాలని అధికారులు పైలెట్లకు సూచించారు.

కుప్పకూలిన రెండు వాయుసేన విమానాలు.. ఓ పైలట్ మృతి.. ఇద్దరు సేఫ్

A Technical Fault in an Air Force Aircraft :దీంతో వ్యూయల్(Fuel)​ కొంత అయ్యే వరకు గాలిలో గంట వరకు వేచి ఉన్న పైలెట్లు ఆ తర్వాత సురక్షితంగా రన్​వే పై ల్యాండ్​ అయింది. ఈ సందర్భంగా విమానంలో ఇద్దరు పైలెట్లు, 14 మంది ఇతర సిబ్బంది ఉన్నారు. విమానం సేఫ్​గా ల్యాండ్​ కావడంతో అక్కడున్న సిబ్బంది, విమానంలోని వారు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు విచారణ చేసే అవకాశం ఉంది. విమానం సాంకేతిక లోపం కారణంగా బేగంపేట్​ విమానాశ్రయంలో పలు విమానాలకు ఆలస్యంగా అనుమతిచ్చారు. దీంతో కొందరు ప్రముఖులు ఇబ్బంది పడ్డారు. బేగంపేట్​ విమానాశ్రయం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి వచ్చిన సినీనటులు జూనియర్​ ఎన్టీఆర్​, రామ్​ చరణ్​ దంపతులు రెండు గంటల పాటు విమానాశ్రయంలో వేచి ఉన్నారు. ఇప్పుడు ఈ విమానం గాల్లో చక్కర్లు కొట్టిన సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతుంది.

గాల్లో గుర్తుతెలియని వస్తువు- రఫేల్‌ జెట్లతో వాయుసేన వేట- చివరకు!

పొలాల మధ్య కుప్పకూలిన వాయుసేన విమానం.. ఇద్దరు పైలట్ల పరిస్థితి..

Last Updated : Mar 1, 2024, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details