తెలంగాణ

telangana

జడ్డూకు అన్యాయం - తెరపైకి మరోసారి డీఆర్‌ఎస్ చర్చ

By ETV Bharat Telugu Team

Published : Jan 27, 2024, 4:10 PM IST

Uppal Test Ravindra Jadeja : రవీంద్ర జడేజా ఔట్‌ విషయంలో వివాదం నెలకొంది. దీంతో మరోసారి డీఆర్‌ఎస్ (DRS) నిర్ణయంపై క్రికెట్‌ అభిమానుల్లో చర్చ మొదలైంది.

జడ్డూకు అన్యాయం - తెరపైకి మరోసారి డీఆర్‌ఎస్ చర్చ
జడ్డూకు అన్యాయం - తెరపైకి మరోసారి డీఆర్‌ఎస్ చర్చ

Uppal Test Ravindra Jadeja : ఉప్పల్‌ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో కీలక ఇన్నింగ్స్‌ ఆడిన రవీంద్ర జడేజా(87) ఔట్​ వివాదంపై చర్చ కొనసాగుతూనే ఉంది. దీంతో మరోసారి డీఆర్‌ఎస్‌పై చర్చ మొదలైంది. శుక్రవారం(జనవరి 26) రెండో రోజు ఆటలో పట్టుదలగా నిలబడి టీమ్​ఇండియా భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించిన అతడు నేడు(జనవరి 27) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు. కేవలం ఆరు పరుగులే చేసి జో రూట్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.

అంపైర్‌ ఔట్‌ ఇవ్వడం వల్ల జడేజా రివ్యూకు వెళ్లి డీఆర్‌ఎస్‌ తీసుకున్నాడు. అయితే సమీక్షలో బంతి ప్యాడ్లను, బ్యాట్‌ను ఒకే సమయంలో తగిలినట్లు కనిపించింది. ఇంపాక్ట్‌తో పాటు వికెట్లను బాల్ తాకడంతో 'అంపైర్స్‌ కాల్' కూడా వచ్చింది. అప్పటికే ఫీల్డ్‌ అంపైర్ ఔట్‌ ఇవ్వడం వల్ల భారత అభిమానులు షాక్‌కు గురయ్యారు. సమీక్ష సందర్భంగా థర్డ్‌ అంపైర్‌ సరైన నిర్ణయం తీసుకోలేదని విమర్శలు గుప్పించడం ప్రారంభించారు. మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.

జడేజా ఔట్‌పై రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు : రవీంద్ర జడేజాను థర్డ్​ అంపైర్‌ ఔట్‌గా అనౌన్స్ చేయడంపై వ్యాఖ్యాత రవిశాస్త్రి కూడా స్పందించాడు. "ఒకవేళ ఫీల్డ్‌ అంపైర్‌ జడ్డూకు అనుకూలంగా నిర్ణయం ఇచ్చి ఉంటే అప్పుడు థర్డ్‌ అంపైర్‌ కూడా నాటౌట్‌గా అనౌన్స్ చేసేవాడు. ఈ సారి మాత్రం బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ రూల్​ బ్యాటర్‌కు వర్తించదు. అందుకే, జడేజా ఔట్‌గా పెవిలియన్‌కు చేరాడు" అని అన్నాడు.

"డీఆర్‌ఎస్‌ అత్యంత చెత్త నిర్ణయం తీసుకుంది. మూడో అంపైర్​ సరిగ్గా సమీక్షించలేదు. బాల్​ బ్యాట్‌ను తాకిందా? ప్యాడ్లను తాకిందా? అనేది కూడా నిర్థారించుకోలేకపోవడం దారుణమైన విషయం. బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద నిర్ణయం బ్యాటర్‌కు అనుకూలంగా ఇవ్వాలి" అని ఓ నెటిజన్ పేర్కొన్నారు.

"జడేజాకి దురదృష్టం కలిసొచ్చింది. అంపైర్లు ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. డీఆర్‌ఎస్‌ వీటిని గుర్తించలేకపోతోంది" అని మరో నెటిజన్ అన్నారు.

"ఇలాంటి నిర్ణయంపై ఐసీసీ రియాక్ట్ అవ్వాలి. క్లారిటీ లేకుండానే థర్డ్‌ అంపైర్‌ ఔట్‌ ఇవ్వడంపై విచారణ చేయాలి. బంతి బ్యాట్‌ను తాకిందో లేదో కూడా అతడికి తెలియదు. ఔట్‌గా ఎలా నిర్థారిస్తాడు? " అని ఇంకో క్రికెట్ అభిమాని పేర్కొన్నారు.

"రవీంద్ర జడేజా ఔట్‌ విషయంలో థర్డ్ అంపైర్‌ బాల్‌ ట్రాకింగ్‌కు వెళ్లాల్సిన పనే లేదు. బ్యాట్‌ను బంతి తాకినట్లు తెలుస్తోంది" అని ఒకరు రాసుకొచ్చారు.

టీమ్ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్ కంప్లీట్- 190 పరుగుల లీడ్​లో భారత్

'మ్యాచ్ ఫిక్సింగ్' కాంట్రవర్సీలో షోయబ్ మాలిక్- కాంట్రాక్ట్​ రద్దు చేసుకున్న ఫ్రాంచైజీ!

ABOUT THE AUTHOR

...view details