తెలంగాణ

telangana

యంగ్ రోహిత్​ను చూశారా? - వైరల్​గా మారిన హిట్​మ్యాన్ టీనేజ్ ఫొటో - Rohith Sharma Teen age photo

By ETV Bharat Telugu Team

Published : Apr 30, 2024, 2:58 PM IST

Happy Birthday Rohith Sharma Teen age photo : రోహిత్ శర్మ పుట్టినరోజు సందర్భంగా అతడి చిన్న నాటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మీరు చూశారా?

.
.

Happy Birthday Rohith Sharma Teen age photo :'8 ఏళ్ల వయసు నుంచే నా ఇన్​స్పిరేషన్​ - ఆయన్ను ఎప్పుడూ ఫాలో అవుతుంటాను' - Rohit Sharma Inspirationటీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పుట్టినరోజు నేడు(ఏప్రిల్ 30). నేడు అతడు 37వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా హిట్‌మ్యాన్‌కు ఫ్యాన్స్, క్రికెటర్లు, సెలబ్రెటీలు బర్త్‌ డే విషెస్ తెలుపుతున్నారు. సోషల్ మీడియా అంతా హ్యాపీ బర్త్‌ డే రోహిత్ శర్మ అనే హ్యష్‌ ట్యాగ్​ను ఫుల్ ట్రెండ్​ చేస్తూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

భారత మాజీ క్రికెటర్లు యువరాజ్‌ సింగ్, గౌతమ్ గంభీర్‌, వసీమ్ జాఫర్​తో పాటు బీసీసీఐ కార్యదర్శి జై షా కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దిల్లీ క్యాపిటల్స్‌, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ ఫ్రాంచైజీలు అయితే స్పెషల్ పోస్టర్లతో విషెస్‌ చెప్పాయి. ముంబయి ఇండియన్స్‌ సలామ్ రోహిత్ భాయ్‌ అంటూ ఓ సాంగ్​ను సోషల్ మీడియాలో రిలీజ్​ చేసి తమకున్న అభిమానాన్ని తెలిపింది. ఇది క్రికెట్ అభిమానులను బాగా ఆకర్షిస్తోంది.

"భారత క్రికెట్‌ ఉన్న అజేయ శక్తికి నా తరఫున బర్త్​ డే విషెస్ తెలియజేస్తున్నాను. రోహిత్‌ నీ నాయకత్వ పటిమ, నైపుణ్యాలు, ఓటమిని అంగీకరించని వ్యక్తిత్వం మన జట్టుకు గుండె చప్పుడు లాంటిది. నువ్వు మరో ఏడాది కూడా బౌండరీలు బాదతూ చరిత్ర సృష్టించాలిని కోరుకుంటున్నాను" అని జై షా తన సోషల్ మీడియా ఎక్స్‌ అకౌంట్​లో పోస్టు చేశాడు.

అయితే వీటన్నింటికీ భిన్నంగా రోహిత్ శర్మకు స్పెషల్ విషెస్ తెలిపారు అతడి తల్లి పూర్ణిమ శర్మ. హిట్ మ్యాన్​ టీనేజ్‌లో ఉన్నప్పుడు అతడితో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ పిక్​ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్​గా మారింది. అందరూ ఈ ఫొటోనూ తెగ షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.

ఇకపోతే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ 17 సీజన్‌లో రోహిత్ శర్మ బిజీగా ఉన్నాడు. ముంబయి ఇండియన్స్​కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడి 160.31 స్ట్రెక్‌రేట్‌తో 311 రన్స్ ఖాతాలో వేసుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్​పై సెంచరీ బాది ఆకట్టుకున్నాడు. మరి కాసేపట్లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్​, ముంబయి ఇండియన్స్​ జట్లు పోటీపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి హిట్ మ్యాన్​ను బర్త్‌ డే గిప్ట్ ఇవ్వాలని ముంబయి ప్లేయర్స్​ ఆశిస్తున్నారు.

వన్డేల్లో హిట్​మ్యాన్ వరల్డ్​ రికార్డ్ - పదేళ్లైనా ఇంకా చెరగలేదు - Rohit Sharma Birthday

'8 ఏళ్ల వయసు నుంచే నా ఇన్​స్పిరేషన్​ - ఆయన్ను ఎప్పుడూ ఫాలో అవుతుంటాను' - Rohit Sharma Inspiration

ABOUT THE AUTHOR

...view details