తెలంగాణ

telangana

IPL 2024లో సరికొత్త టెక్నాలజీ!

By ETV Bharat Telugu Team

Published : Mar 20, 2024, 6:59 AM IST

IPL 2024 Smart Replay System : నిర్ణయాల్లో కచ్చితత్వాన్ని, వేగాన్ని పెంచడానికి ఐపీఎల్‌-17లో స్మార్ట్‌ రీప్లే సిస్టమ్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆ వివరాలు.

IPL 2024లో సరికొత్త టెక్నాలజీ!
IPL 2024లో సరికొత్త టెక్నాలజీ!

IPL 2024 Smart Replay System : ఐపీఎల్‌ మ్యాచ్‌లు నరాలు తెగే ఉత్కంఠను అందిస్తాయి. ఒక్క పరుగు, ఒక్క వికెట్, ఒక్క క్యాచ్‌ కూడా మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేస్తాయి. ఇలాంటి క్రికెట్‌ లీగ్‌లో అంపైర్‌ డెసిషన్‌ చాలా కీలకం. ఒక తప్పుడు నిర్ణయం మ్యాచ్‌నే కాదు టైటిల్‌ను కూడా దూరం చేయవచ్చు. ఇలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకూడదని బీబీసీఐ రానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (IPL 2024) 17వ సీజన్‌లో కొత్త సిస్టమ్‌ను ఇంట్రడ్యూస్‌ చేస్తోంది. అంపైర్‌లు వేగంగా, ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునేందుకు స్మార్ట్ రీప్లే సిస్టమ్‌ను అమలు చేయనుంది.

ESPNCricinfo నివేదిక ప్రకారం ఎనిమిది హాక్-ఐ హై-స్పీడ్ కెమెరాలు గ్రౌండ్‌ చుట్టూ ఉంటాయి. ఈ కెమెరాలను పెయిర్స్‌గా ఉంచుతారు, గ్రౌండ్‌కు రెండు వైపులా, స్ట్రైట్‌ బౌండరీల వద్ద రెండు, స్క్వేర్ లెగ్ పొజిషన్‌ రెండు వైపులా ఉంటాయి. కొత్త సిస్టమ్‌లో టీవీ అంపైర్ ఇద్దరు హాక్-ఐ ఆపరేటర్లు ఒకే గదిలో కలిసి పని చేస్తారు. ఇద్దరు ఆపరేటర్లు, గ్రౌండ్‌లోని ఎనిమిది హాక్-ఐ హై-స్పీడ్ కెమెరాల ద్వారా క్యాప్చర్‌ చేసిన ఇమేజ్‌లను టీవీ అంపైర్‌కి అందజేస్తారు. గతంలో హాక్-ఐ ఆపరేటర్లు, థర్డ్ అంపైర్ మధ్య మధ్యవర్తిగా వ్యవహరించిన టీవీ బ్రాడ్‌కాస్ట్‌ డైరెక్టర్ రోల్, కొత్త సిస్టమ్‌లో అవసరం లేదు.

అంపైర్‌కి మరిన్ని ఆప్షన్లు - టీవీ అంపైర్ ఇప్పుడు మునుపటి కంటే స్ప్లిట్-స్క్రీన్ ఇమేజ్‌లు సహా మరిన్ని విజువల్స్‌కు యాక్సెస్‌ పొందుతాడు. ఉదాహరణకు బౌండరీ రోప్‌పై ఉన్న ఫీల్డర్ మిడ్‌ఎయిర్‌లో ఓవర్‌హెడ్ క్యాచ్ అందుకోవడం వంటి విజువల్స్‌ గతంలో పొందడం కష్టంగా ఉండేది. అయితే క్యాచ్ సమయంలో ఫీల్డర్ పాదాలు, చేతుల స్ప్లిట్-స్క్రీన్ వ్యూస్‌, సింక్రనైజ్డ్‌ వీడియో ఫుటేజ్‌తో, బౌండరీ క్యాచ్‌లకు సంబంధించిన నిర్ణయాలు మరింత కచ్చితమైనవిగా, వేగంగా మారనున్నాయి. అదేవిధంగా ఓవర్‌త్రో ద్వారా ఫోర్ వచ్చినప్పుడు, త్రో సమయంలో బ్యాటర్‌లు క్రాస్‌ అవుతున్నారో లేదో స్ప్లిట్ స్క్రీన్ డిస్‌ప్లే చేస్తుంది. ఆ పర్టికుల్ మూమెంట్‌లో క్యాప్చర్‌ చేసిన సింక్రనైజ్డ్ వీడియో, ఇమేజ్‌లతో హాక్-ఐ ఆపరేటర్లు టీవీ అంపైర్‌కు స్పష్టమైన విజువల్స్‌ను అందించగలరు. గతంలో ఈ అవకాశం ఉండేది కాదు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2023 వరకు, హాక్-ఐ కెమెరాలు బాల్-ట్రాకింగ్, అల్ట్రా ఎడ్జ్ కోసం మాత్రమే ఉపయోగించారు. ఇటీవల ఎంపిక చేసిన అంపైర్లకు బీసీసీఐ రెండు రోజుల వర్క్‌షాప్‌ను నిర్వహించింది, వారిలో దాదాపు 15 మంది భారత్‌, విదేశీ అంపైర్లు ఐపీఎల్‌ 2024లో స్మార్ట్ రీప్లే సిస్టమ్‌తో పని చేస్తారు. ది హండ్రెడ్ కాంపిటీషన్‌లో ఇంగ్లండ్‌, వేల్స్ క్రికెట్ బోర్డ్ ఇదే విధమైన రిఫరల్ సిస్టమ్‌ని టెస్ట్‌ చేసింది.

హాక్‌-ఐ సిస్టమ్‌ అంటే ఏంటి? - హాక్-ఐ అనేది ప్రధానంగా క్రికెట్, టెన్నిస్‌ వంటి స్పోర్ట్స్‌లో ఆబ్జెక్ట్స్‌ను ట్రాక్ చేయడానికి ఉపయోగించే కంప్యూటర్ సిస్టమ్. వాస్తవానికి క్రికెట్ కోసం ఈ సిస్టమ్‌ను డెవలప్ చేశారు. హాక్-ఐ, బాల్‌ మూవ్‌మెంట్స్‌ను క్యాప్చర్‌ చేయడానికి గ్రౌండ్‌ చుట్టూ ఉంచిన హై-స్పీడ్ కెమెరాలను ఉపయోగిస్తుంది. క్రికెట్‌లో హాక్-ఐ ప్రధానంగా రెండు అవసరాలకు ఉపయోగిస్తారు. మొదటిది డెసిషన్ రివ్యూ సిస్టమ్ (DRS). డీఆర్‌ఎస్‌లో హాక్-ఐ చాలా కీలకం. ఎల్‌బీడబ్ల్యూ రివ్యూ సమయంలో బాల్‌ వికెట్స్‌ తాకిందా? ప్యాడ్‌లు మిస్‌ అయిందా? వంటివి అంచనా వేయడంలో సహాయపడుతుంది. అలానే బ్రాడ్‌కాస్ట్‌ అనాలసిస్‌ కోసం ఉపయోగిస్తారు. వ్యూవర్స్‌కి బాల్‌ స్వింగ్, స్పిన్ మూవ్‌మెంట్స్‌ను చూపిస్తుంది. బ్రాడ్‌కాస్టర్‌లు తరచుగా డెలివరీలను అనలైజ్‌ చేయడానికి హాక్-ఐ గ్రాఫిక్స్‌ ఉపయోగిస్తారు.

కోహ్లీ, అనుష్క షాకింగ్ నిర్ణయం - ఇది నిజమైతే ఫ్యాన్స్​కు హార్ట్ బ్రేకే!

ముంబయి జట్టుకు ఆ స్టార్ క్రికెటర్ దూరం - పేస్​ దళానికి తీరనిలోటు!

ABOUT THE AUTHOR

...view details