తెలంగాణ

telangana

ఉప్పల్‌ మ్యాచ్‌కు మీరు వెళ్తున్నారా? - కచ్చితంగా ఇవి పాటించాల్సిందే! - IPL 2024 Sunrisers VS MI

By ETV Bharat Telugu Team

Published : Mar 27, 2024, 9:07 AM IST

IPL 2024 Sunrisers VS Mumbai Indians : ఉప్పల్ స్టేడియం వేదికగా సన్​రైజర్స్​ - ముంబయి ఇండియన్స్ తలపడేందుకు సిద్ధమైపోయాయి. అయితే ఈ మ్యాచ్​ నేరుగా స్టేడియానికి వెళ్లి చూసేవారు పాటించాల్సిన నియమాలేంటో తెలుసుకుందాం.

ఉప్పల్‌ మ్యాచ్‌కు మీరు వెళ్తున్నారా? - కచ్చితంగా ఇవి పాటించాల్సిందే!
ఉప్పల్‌ మ్యాచ్‌కు మీరు వెళ్తున్నారా? - కచ్చితంగా ఇవి పాటించాల్సిందే!

IPL 2024 Sunrisers VS Mumbai Indians :ఐపీఎల్‌ - 17 ఆతిథ్యానికి హైదరాబాద్‌ నగరం సిద్ధమైంది. రసవత్తర మ్యాచ్‌లకు వేదికగా నిలిచేందుకు ఉప్పల్‌ స్టేడియం క్రికెట్‌ అభిమానులను అలరించేందుకు మళ్లీ ముస్తాబైంది. అటు సన్‌రైజర్స్‌ యాజమాన్యం, ఇటు హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) మ్యాచ్‌ల నిర్వహణ కోసం అంతా రెడీ చేశారు. మరి కొన్ని గంటల్లో ఉప్పల్‌ స్టేడియంలో(Uppal stadium) హోం టీమ్‌ సన్​రైజర్స్ హైదరాబాద్​ - ముంబయి ఇండియన్స్​ తలపడనున్నాయి. ఈ రెండు జట్లు తమ తొలి మ్యాచుల్లో ఓడిపోయాయి. దీంతో ఎలాగైన ఈ రెండో మ్యాచులో గెలిచి బోణీ కొట్టాలని పట్టుదలతో ఉన్నాయి. ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలో ప్రాక్టీస్ కూడా చేశారు. ఇక అభిమానులు అసలైన పోరును ఆస్వాదించడమే తరువాయి.

అయితే వీకెండ్ కాకపోయినా ముంబయి లాంటి బడా టీమ్​తో సన్​రైజర్స్​ తలపడేందుకు రెడీ అవుతుండడంతో స్టేడియంలో నేరుగా మ్యాచ్ చూసేందుకు ఫ్యాన్స్ భారీగానే వచ్చేందుకు రెడీ అయిపోయారు. ఈ నేపథ్యంలో మ్యాచ్​ను మైదానంలో చూసేందుకు వెళ్లే వారి కోసం పాటించాల్సిన కొన్ని ఇన్​స్ట్రక్షన్స్​ తీసుకొచ్చాం.

  • నేడు జరిగే ఈ మ్యాచ్‌ కోసం భారీ భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. 2800 పోలీసు సిబ్బందితో 360 సీసీ కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేశారు.
  • సాయంత్రం 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు 3 గంటల ముందే స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతిస్తారు.
  • భద్రతలో భాగంగా అంబులెన్స్‌, మెడికల్‌, ఫైరింజన్​ సర్వీస్​లు అందుబాటులో ఉంటాయి.
  • ప్రేక్షకులు తమ వాహనాలను నిర్దేశిత ప్రాంతంలోనే పార్కింగ్‌ చేయాలన్నారు.
  • బ్లాక్‌లో అస్సలు టికెట్స్​ను విక్రయించరాదు.
  • స్టేడియం బయట, లోపల మహిళల భద్రతకు ప్రత్యేకంగా షీ టీంలు ఉంటాయి.
  • స్టేడియంలోకి ఎలాంటి వస్తువులను తీసుకెళ్లకూడదు. సిగరెట్, లైటర్, అగ్గిపెట్టె, ల్యాప్‌ ట్యాప్‌లు, బ్యానర్స్, బ్యాటరీలు, హెల్మెట్స్​, ఫర్‌ఫ్యూమ్స్, బైనాక్యూలర్లు, ఎల్రక్టానిక్‌ పరికరాలు, కెమెరాలు, పెన్నులు, బయటి తిను బండారాలు, వాటర్‌ బాటిళ్లు స్టేడియంలోకి నో ఎంట్రీ.
  • వీటిలో దేనినైనా ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయి.
  • ఇంకా మెట్రో రైల్ సమయాన్ని పొడిగించారు. ఆర్టీసీ బస్సుల అదనపు ట్రిప్పులు ఉంటాయి. 11.30 గంటల వరకు ఉంటాయి.
  • ఇకపోతే ఈ మ్యాచ్ టికెట్ల విక్రయ విషయంలో ఎప్పటిలాగే గందరగోళం జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. టికెట్ల విక్రయం ప్రారంభించిన కాసేపట్లోనే సోల్డ్‌ ఔట్‌ అని చూపించడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే క్రికెట్‌ అభిమానుల్లో బాగా నిరాశ కనిపిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details