తెలంగాణ

telangana

కోల్​కతా బౌలర్ ఓవర్​ యాక్షన్​ - ఒక మ్యాచ్​ నిషేధం - IPL 2024 KKR

By ETV Bharat Telugu Team

Published : Apr 30, 2024, 7:09 PM IST

Updated : Apr 30, 2024, 9:42 PM IST

IPL 2024 Kolkata Knight Riders Seamer Harshit Rana Suspended : కేకేఆర్​ సీమర్ హర్షిత్‌ రాణా ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్​లో కాస్త ఓవరాక్షన్ ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మరోసారి అతడిపై చర్యలు తీసుకున్నారు ఐపీఎల్ నిర్వాహకులు.

.
.

IPL 2024 Kolkata Knight Riders Seamer Harshit Rana Suspended :ఏప్రిల్‌ 29న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ సీమర్‌ హర్షిత్‌ రాణా ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు తేలింది. దీంతో అతనికి మ్యాచ్‌ ఫీజులో 100 శాతం జరిమానా విధించారు. ఒక మ్యాచ్‌ నుంచి సస్పెండ్‌ చేశారు.

కాగా, ఈ మ్యాచ్‌లో కోల్‌కతా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హర్షిత్‌ రాణా 4 ఓవర్లలో కేవలం 28 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అయితే మ్యాచ్‌లో అభిషేక్ పోరెల్‌ వికెట్‌ తీసిన సందర్భంలో హర్షిత్‌ రాణా సెలబ్రేట్‌ చేసుకున్న తీరుకు చర్యలు తీసుకున్నారు ఐపీఎల్ నిర్వాహకులు. రాణా తన చేతిని పోరెల్ వైపు చూపిస్తూ తిరిగి పెవిలియన్‌కు వెళ్లమని సూచించాడు. ఈ క్రమంలోనే మరోసారి ఫ్లైయింగ్‌ కిస్‌ ఇవ్వబోయి ఆగిపోయాడు. ఇది కాస్త వివాదమైంది. అతడి చర్యను తప్పుబడుతూ అందరూ విమర్శించారు.

ఇప్పటికే ఓ సారి తంటాలు తెచ్చిన ‘కిస్‌’ - అంతకుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్‌కు ఫ్లైయింగ్‌ కిస్‌ ఇచ్చి క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొన్నాడు రానా. అప్పుడు అతని మ్యాచ్ ఫీజులో 60 శాతం జరిమానా విధించారు. ఇప్పుడు సోమవారం దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో అదే తప్పును పునరావృతం చేశాడు.

దీనికి సంబంధించి ఐపీఎల్‌ విడుదల చేసిన ప్రకటనలో - ‘ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5 ప్రకారం రాణా లెవల్ 1 నేరానికి పాల్పడ్డాడు. అతను నేరాన్ని మ్యాచ్ రిఫరీ నిర్ణయాన్ని అంగీకరించాడు. ప్రవర్తనా నియమావళి లెవల్ 1 ఉల్లంఘనలకు, మ్యాచ్ రిఫరీ నిర్ణయమే అంతిమం.’ అని తెలిపింది. దీంతో రానా ఇప్పుడు ముంబయి ఇండియన్స్‌తో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఆడనున్న తదుపరి మ్యాచ్‌కు దూరం కానున్నాడు. మే 3న ముంబయిలో ఈ మ్యాచ్‌ జరగనుంది.

ఇకపోతే సోమవారం(ఏప్రిల్‌ 29)న కోల్‌కతా వర్సెస్‌ దిల్లీ మ్యాచ్‌లో కేకేఆర్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లు దిల్లీని ఏ దశలోనూ సులువుగా పరుగులు చేయనీలేదు. దిల్లీ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ 26 బంతుల్లో 35 పరుగులు చేసి హైయస్ట్‌ స్కోరర్‌గా నిలిచాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

.

ప్లే ఆఫ్స్​కు ఆ స్టార్ ప్లేయర్స్​ దూరం - ఎందుకంటే? - IPL 2024 Play Offs

టీమ్ఇండియా జట్టు ప్రకటించిన బీసీసీఐ - పంత్ ఇన్,​ రాహుల్ ఔట్​ - ICC T20 World Cup 2024

Last Updated :Apr 30, 2024, 9:42 PM IST

ABOUT THE AUTHOR

...view details