తెలంగాణ

telangana

2024 రంజీ ఫైనల్లో 'ముంబయి'దే హవా- 42వ టైటిల్ కైవసం

By ETV Bharat Telugu Team

Published : Mar 14, 2024, 2:00 PM IST

Updated : Mar 14, 2024, 2:38 PM IST

2024 Ranji Trophy Winner: 2024 రంజీ విజేతగా నిలిచింది ముంబయి జట్టు. ఫైనల్​లో విదర్భతో తలపడ్డ ముంబయి 169 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Etv Bharat2024 Ranji Trophy Winner
2024 Ranji Trophy Winner

2024 Ranji Trophy Winner:2024 రంజీ ట్రోఫీ ఫైనల్​లో విదర్భ జట్టుపై ముంబయి ఘన విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్​లో 169 పరుగుల తేడాతో నెగ్గిన ముంబయి 42వ సారి రంజీ ఛాంపియన్​గా నిలిచింది. 538 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భ రెండో ఇన్నింగ్స్​లో 368 పరుగులకే కుప్పకూలింది. కరుణ్ నాయర్ (74 పరుగులు), అక్షయ్ వాడ్కర్ (102 పరుగులు), హర్ష్ దూబే (65 పరుగులు) మాత్రమే రాణించారు. ముంబయి బౌలర్లలో తనుశ్ కొటియన్ 4, ముషీర్ ఖాన్ 2, తుషార్ దేశ్​పాండే 2 షమ్స్ ములాని 1 వికెట్ దక్కించుకున్నారు. కాగా, గత ఎనిమిదేళ్లలో ముంబయి రంజీ ట్రోఫీ ఛాంపియన్​గా నిలివడం ఇదే తొలిసారి. చివరిసారిగా ముంబయి 2015- 16లో టైటిల్ నెగ్గింది.

భారీ లక్ష్య ఛేదనలో విదర్భ ఒక దశలో 352-5తో గెలుపు దిశగా సాగుతోంది. అప్పటికి క్రీజులో అక్షయ్ వార్కర్ (102), వార్ష్ దూబే (65) ఉన్నారు. వీరిద్దరూ ఆరో వికెట్​కు 130 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ముంబయిని ఆందోళనలో నెట్టారు. కానీ, తనష్ కొటియన్ 353 పరుగుల వద్ద సెంచరీ హీరో అక్షయ్​ను పెవిలియన్ చేర్చి, ముంబయికి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత వరుసగా దూబే, ఆదిత్య సార్వతే (3 పరుగులు), యశ్ ఠాకూర్ (6 పరుగులు), ఉమేశ్ యాదవ్ (6 పరుగులు) ఔట్ అయ్యారు. కాగా, విదర్భ 15 పరుగుల వ్యవధిలో చివరి 5 వికెట్లు కోల్పోయింది.

అంతకుముందు ముంబయి రెండో ఇన్నింగ్స్​లో ముషీర్ ఖాన్ (136 పరుగులు), కెప్టెన్ అజింక్యా రహానే (73 పరుగులు), శ్రేయస్ అయ్యర్ (95 పరుగులు), షమ్స్ ములాని (50 పరుగులు) రాణించడం వల్ల జట్టుకు భారీ స్కోర్ దక్కింది. విదర్భ బౌలర్లలో హర్ష్ దూబే 5, యశ్ ఠాకూర్ 3, ఆదిత్య ఠాక్రే, అమన్ మోఖడే తలో వికెట్ దక్కించుకున్నారు.

స్కోర్లు

  • ముంబయి తొలి ఇన్నింగ్స్​ - 224/10
  • విదర్భ తొలి ఇన్నింగ్స్​ - 105/10
  • ముంబయి రెండో ఇన్నింగ్స్​- 418/10
  • విదర్భ రెండో ఇన్నింగ్స్​- 368/10

రంజీ ట్రోఫీ సెమీఫైనల్​ - శార్దూల్, హిమాన్షు అద్భుత శతకాలు

సచిన్​ టు పుజారా- రంజీలో అత్యుత్తమ ప్లేయర్స్ వీరే!

Last Updated :Mar 14, 2024, 2:38 PM IST

ABOUT THE AUTHOR

...view details