తెలంగాణ

telangana

ఈ వారం ఆ రాశివారికి పెళ్లి ఫిక్స్​- స్వల్ప అనారోగ్య సమస్యలు! - Weekly Horoscope April 2024

By ETV Bharat Telugu Team

Published : Apr 7, 2024, 5:00 AM IST

Weekly Horoscope From 7th april to 13th april 2024 : 2024 ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Etv Bharat
Etv Bharat

Weekly Horoscope From 7th april to 13th april 2024 : 2024 ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వివాహం కాని వారికి పెళ్లి నిశ్చయమవుతుంది. వివాహితుల కుటుంబ జీవితంలో స్వల్ప ఒత్తిడి ఉంటుంది. అయితే మీరు ఓర్పుతో వ్యవహరించి ఒత్తిడి నుంచి బయటపడతారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంది. వ్యాపారస్థులకు పెట్టుబడులు లాభాలను తెచ్చి పెడతాయి. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చేతికి అందుతాయి. శుభవార్తలు వింటారు. ఉన్నత విద్యకు అనుకూలమైన సమయం. ఏకాగ్రతతో మీరు ఆశించిన విజయాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. దినచర్యలో మార్పులతో కుదుటపడతారు. కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది. సుబ్రహ్మణ్యుని ఆలయ సందర్శనం మేలు చేస్తుంది.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ వారం అద్భుతంగా ఉంది. ఈ వారమంతా మీరు చాలా సంతోషంగా ఉంటారు. ప్రేమికులకు కలిసివచ్చే కాలం. కుటుంబంలో శాంతిసౌఖ్యాలు నెలకొంటాయి. భవిష్యత్ అవసరాల కోసం ముందుచూపుతో డబ్బు పొదుపు చేస్తారు. వ్యాపారస్థులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగులకు ప్రమోషన్లు లభిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారిస్తారు. ఇంటి మరమ్మత్తుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈవారం సాధారణంగానే ఉంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. ఆర్థికంగా అనుకూలం. ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యం బాగా ఉంటుంది. సంతానం భవిష్యత్ కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారస్థులకు ప్రయాణాలు అనుకూలిస్తాయి. పోటీపరీక్షలకు తయారయ్యే వారు కష్టపడితే మంచి విజయాలను అందుకోగలరు. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి ఉంది.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంది. అన్ని వైపుల నుంచి సహకారం ఉంటుంది. కుటుంబంతో తీర్థయాత్రలకు వెళతారు. ఆర్థికంగా బలపడతారు. అనేక మార్గాల నుంచి డబ్బు అందుతుంది. గతంలో వాయిదా పడ్డ అన్ని పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. వ్యాపారస్థులకు సర్వత్రా విజయం గోచరిస్తోంది. ఉన్నత విద్య అభ్యసించే వారికి అనుకూలమైన సమయం. ఆరోగ్యం బాగుంటుంది. శివారాధన చేస్తే ప్రశాంతంగా ఉంటుంది.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ వారం సాధారణంగా ఉంటుంది. వ్యాపారస్థులు పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగస్థులకు ఇది మంచి సమయం. ప్రమోషన్లకు అవకాశం ఉంది. దూరప్రయాణాలు చేస్తారు. విద్యార్థులు కష్టపడితేనే మంచి ఫలితాలు సాధించగలరు. అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్త అందుకుంటారు. ఉద్యోగస్థులు ఒకింత ఒత్తిడికి గురవుతారు. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ వారం ఆనందంగా ఉంటుంది. ఇంట్లో శాంతి నెలకొంటుంది. వ్యాపారస్థులు వ్యాపారాన్ని విస్తరించి అధికలాభాలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. అన్నదమ్ముల మధ్య కొనసాగుతున్న వివాదాలు సమసిపోతాయి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం అవసరం. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థికంగా బలపడతారు. శ్రీరామ రక్షా స్తోత్రం పఠించండి.

తుల (Libra) :తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది కాని ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. ఈ వారం కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ధైర్యంగా ఉంటే విజయం మీదే! ఉద్యోగస్థులకు ఈ వారం సామాన్యంగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఉపాధి లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఉన్నత విద్యకు అనుకూలమైన సమయం. చిరు వ్యాపారులకు వ్యాపారంలో ఆశించిన లాభాలు ఉంటాయి. ఇంట్లో పూజల కోసం ధనవ్యయం ఉంటుంది. నవగ్రహ ఆరాధన మేలు చేస్తుంది.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ వారం సాధారణంగా ఉంది. మీ వ్యక్తిగత విషయంలో ఇతరుల జోక్యం చికాకు కలిగిస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు వస్తాయి. వ్యాపారస్థులకు కలిసి వచ్చే కాలం. నూతన ఒప్పందాలు ప్రయాజనాలు ఇస్తాయి. ఉద్యోగస్థులకు పని ప్రదేశంలో సమస్యలు ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. యోగా, ధ్యానంతో మానసిక ప్రశాంతత కలుగుతుంది. శ్రీలక్ష్మి ఆరాధన శుభప్రదం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. జీవితభాగస్వామితో వివాదాలు ఉంటాయి. అయితే ఇవి తాత్కాలికమే! ఆర్థికంగా బాగుంటుంది. ధనప్రవాహం ఉంటుంది. వ్యాపారులకు మంచి లాభాలు ఉంటాయి. విద్యార్థులకు సామాన్యంగా ఉంటుంది. ఉన్నత విద్యకు అనుకూలమైన సమయం. కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు. ఇది మీ మనస్సుకు శాంతిని కలిగిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆంజనేయ స్వామి ధ్యానం మేలు చేస్తుంది.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. ఆదాయం సామాన్యం ఉంటుంది. ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. ఉద్యోగులకు కలిసివచ్చే కాలం. మీరు కోరుకున్న పదోన్నతి దొరుకుతుంది. విందువినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. దూరప్రాంతాల నుంచి బంధువులు వస్తారు. శనీశ్వర ధ్యానం మేలు చేస్తుంది.

కుంభం (Aquarius) :కుంభరాశి వారు ఈ వారం చాలా ఆనందంగా ఉంటారు. తలపెట్టిన అన్ని పనులు పూర్తి అవుతాయి. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. పెద్దల ఆశీర్వాదంతో అన్ని పనులు విజయవంతం అవుతాయి. ఎగుమతి, దిగుమతి వర్తకులకు మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు ఉంటాయి. విద్యార్థులకు అనుకూలమైన కాలం. ఆర్థికంగా బాగుంటుంది. వేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. కుటుంబసభ్యుల మద్దతు లభిస్తుంది. వివాదాలు సమసిపోతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. గతంలో రావాల్సిన బకాయిలు చేతికి అందుతాయి. వ్యాపారులకు పెట్టుబడులు లాభాలను తెచ్చి పెడతాయి. సోదరుల మధ్య విభేదాలు సమసిపోతాయి. అనవసర ప్రయాణాలు కోసం ధనవ్యయం ఉంటుంది. రోజువారీ ఒత్తిడి నుంచి విశ్రాంతి తీసుకోండి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందం నింపుతుంది. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.

ABOUT THE AUTHOR

...view details