తెలంగాణ

telangana

ఈ వారం ఆ రాశి వారికి పెళ్లికుదిరే అవకాశం- ఉద్యోగులకు జాక్​పాట్​! - Weekly Horoscope

By ETV Bharat Telugu Team

Published : Mar 31, 2024, 5:00 AM IST

Weekly Horoscope From 31th March To 6th April 2024 : 2024 మార్చి 31 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Weekly Horoscope
Weekly Horoscope

Weekly Horoscope From 31th March To 6th April 2024 : 2024 మార్చి 31 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ వారం కలిసి వస్తుంది. వ్యాపారులకు నూతన పరిచయాలు అవుతాయి. కుటుంబసభ్యుల మద్దతు ఉంటుంది. తీర్థయాత్రలకు వెళతారు. ఆరోగ్యం బాగుంటుంది. జీవిత భాగస్వామి సహకారం ఉంటుంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఆస్తి కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. అనేక మార్గాల నుంచి ఆదాయం వస్తుంది. ఉన్నత విద్య ప్రయత్నాలు చేసేవారికి కలిసి వచ్చే కాలం. విదేశాలలో ఉన్నత విద్యకు వెళ్లేవారికి శుభ సమయం. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.

వృషభం (Taurus) :వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. అవివాహితులకు పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహితులు సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని గడుపుతారు. ఉన్నత చదువులు చదవాలనుకునే వారికి కలిసి వచ్చే కాలం. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప మంచి ఫలితాలను సాధించలేరు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు కలిసి వచ్చే కాలం. ఉద్యోగస్తులకు తమ యజమాని సహకారం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. ఇష్ట దేవత ఆరాధన మేలు చేస్తుంది.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ వారం చాలా బాగుంటుంది. వృత్తి వ్యాపారాలలో విజయాలు సాధిస్తారు. మీ తల్లితండ్రులు మీ అభివృద్ధి పట్ల గర్వపడతారు. విద్యార్థులకు కలిసి వచ్చే కాలం. ఆరోగ్యం బాగుంటుంది. తగినంత విశ్రాంతి అవసరం. ఆర్థికంగా బలపడతారు. ఆకస్మిక ధనలాభం ఉంది. బంధుమిత్రులతో విహారయాత్రకు వెళతారు. పెళ్లి కాని వారికి సంబంధాలు కుదరవచ్చు. సోదరుల వివాహాలలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్త అందుకుంటారు. దుర్గా ధ్యానం శుభప్రదం.

కర్కాటకం (Cancer) :కర్కాటక రాశి వారికి ఈ వారం అన్నింటా పురోగతి ఉంది. ఆర్థికంగా లాభపడతారు. వివాహితుల వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. వృత్తిలో ఎదురైన సమస్యలను ధైర్యంగా పరిష్కరిస్తారు. ఉన్నత విద్యకు అనుకూలమైన సమయం. ఆరోగ్యం సహకరిస్తుంది. గృహంలో శాంతి సౌఖ్యాలు ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. లక్ష్మీధ్యానం శుభప్రదం.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. బంధుమిత్రులతో మంచి సమయాన్ని గడుపుతారు. కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది. వివాహం కాని వారికి పెళ్లి నిశ్చయం అవుతుంది. ఉద్యోగస్తులు మంచి ప్రతిభను కనబరచిపై అధికారుల ప్రశంసలు పొందుతారు. విద్యార్థులు కష్టపడి చదవడం వల్ల ఆశించిన ఫలితాలను పొందుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. ఆంజనేయస్వామి ధ్యానం మేలు చేస్తుంది.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తీర్థయాత్రలకు వెళతారు. విందువినోదాలలో పాల్గొంటారు. ఉన్నత విద్యకు అనుకూలమైన సమయం. ఆరోగ్యం మెరుగు పడుతుంది. వ్యాపారస్తులు నూతన పరిచయాల వలన లాభం పొందుతారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఉద్యోగులు తమ పై అధికారుల ప్రశంసలు పొందుతారు. తల్లిదండ్రుల సహకారం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. అన్నింటా జయం ఉంటుంది. వినాయకుని ఆలయం సందర్శన మేలు చేస్తుంది.

తుల (Libra) :తులా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులు నూతన పరిచయాలతో వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఉద్యోగస్తులు కొత్త అవకాశాలు లభిస్తాయి. పై అధికారుల ప్రశంసలు కూడా పొందుతారు. నిరుద్యోగులకు మంచి కాలం నడుస్తోంది. మీరు కోరుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. రావాల్సిన బకాయిలు అందుతాయి. పెట్టుబడులు లాభాలను తెచ్చి పెడతాయి. పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థికంగా బలపడుతారు. దుర్గా ధ్యానం మేలు చేస్తుంది.

వృశ్చికం (Scorpio) :వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గతంలో వాయిదా పడ్డ పనులన్నీ పూర్తి చేస్తారు. వివాహ ప్రతిపాదనలు ఆమోదయోగ్యంగా ఉంటాయి. బంధువులతో గొడవలకు దూరంగా ఉండండి. విద్యార్థులకు ఉన్నత విద్య నిమిత్తం విదేశీయానం సూచన ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది. యోగా, ధ్యానం ద్వారా ప్రశాంతతను పొందవచ్చు. ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు కలిసి వచ్చే కాలం. పెట్టుబడులు లభిస్తాయి. ఆర్థికంగా లాభాలను పొందుతారు. సుబ్రహ్మణ్యుని ధ్యానం శుభప్రదం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సు రాశి వారికి ఈ వారం సాధారణంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు ద్వారా కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు తమ పనులను సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. వ్యాపారస్తులకు అన్నింటా విజయం. విద్యార్థులు పోటీపరీక్షలకు తీవంగా కృషి చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇష్ట దేవతారాధనతో ప్రశాంతతను పొందుతారు.

మకరం (Capricorn) :మకర రాశి వారికి ఈ వారం ఆనందంగా గడిచిపోతుంది. బాల్యమిత్రులను కలవడం ఆనందాన్ని ఇస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ధనవ్యయం ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉంటే మేలు. వ్యాపారులు కష్టపడితే తప్ప విజయాలను అందుకోలేరు. విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా చదువుకుంటే విజయం సాధించగలుగుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శిస్తే శుభం.

కుంభం (Aquarius) :కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులతో తీర్థయాత్రలకు వెళతారు. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. భూమిపై పెట్టుబడులు పెడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఛాన్స్ ఉంది. వ్యాపారులకు కలిసి వచ్చే కాలం. ఇంట్లో పూజలు నిమిత్తం ధన వ్యయం ఉంటుంది. శివారాధన ప్రశాంతతను ఇస్తుంది.

మీనం (Pisces) :మీన రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వివాహితులకు కుటుంబ జీవితంలో సౌఖ్యం ఉంటుంది. ప్రేమికులకు కలిసి వచ్చే కాలం. విద్యార్థులు విజయాలను సాధిస్తారు. మిమ్మల్ని తప్పు దారి పట్టించే వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆర్థికంగా అనుకూలం. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారులు ఈ వారం ఒక కీలకమైన ఒప్పందాన్ని చేసుకోవచ్చు. ఇది మీకు లాభాలను తెచ్చి పెడుతుంది. ఆర్థికంగా బలపడుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. నవగ్రహ ధ్యానం శుభ ఫలితాలను ఇస్తుంది.

ABOUT THE AUTHOR

...view details