తెలంగాణ

telangana

ప్రొఫెషనల్​ లైఫ్​లో లక్​ కలిసి రావాలా? - ఈ వాస్తు నియమాలు కంపల్సరీ! - Vastu Tips to Success Professional

By ETV Bharat Telugu Team

Published : Apr 30, 2024, 11:00 AM IST

Updated : Apr 30, 2024, 12:28 PM IST

Vastu Tips for Professional Life: ఇంటి నిర్మాణంతో పాటు ఇంట్లోని వస్తువుల విషయంలోనూ వాస్తు నియమాలను పాటించాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా ప్రొఫెషనల్​ లైఫ్​లో కూడా లక్​ కలసి రావాలంటే అద్దం విషయంలో కొన్ని వాస్తు నియమాలు పాటించాలని సలహా ఇస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Etv Bharat
Etv Bharat

Vastu Tips to Success in Professional Life:సక్సెస్​ఫుల్​ కెరీర్​ను ఎవరు కోరుకోరు చెప్పండి. అయితే ప్రస్తుత పోటీ ప్రపంచంలో కెరీర్​లో పురోగతి సాధించడం కోసం చాలా మంది ఎన్నో అవస్థలు పడతుంటారు. పర్సనల్​ లైఫ్​లో సక్సెస్​ సాధించిన వారు ప్రొఫెషనల్​ లైఫ్​ విషయంలో మాత్రం ఫెయిల్​ అవుతుంటారు. ఎంత కష్టపడి పనిచేసినా అనుకున్న స్థానానికి చేరలేకపోతుంటారు. దీంతో నిరాశ, నిసృహలకు లోనై కెరీర్​పై ఫోకస్​ పెట్టలేకపోతున్నారు. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనేవారు కొన్ని నియమాలను అనుసరించడం వల్ల ప్రొఫెషనల్​ లైఫ్​లో కొంత అదృష్టాన్ని ఆకర్షించవచ్చని వాస్తు నిపుణులు అంటున్నారు. ఆ నియమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం...

అద్దం స్థానం: ఇళ్లు లేదా ఆఫీసు ఎక్కడైనా సరే తూర్పు లేదా ఉత్తర దిశలో అద్దం ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. ఈ రెండు దిశలలో అద్దం ఉంచడం వల్ల మీరు మీ లక్ష్యాలను సాధించడానికి, కెరీర్​లో ముందుకు సాగడానికి సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.

అద్దం ఎత్తు:అద్దాలను గోడలకు పెట్టేటప్పుడు అవి కచ్చితంగా నేల నుంచి 4 నుంచి 5 అడుగల ఎత్తులో ఉండాలి. అలాగే అద్దం వాలకుండా ఎప్పుడూ గోడకు ప్లాట్​గా ఉండేలా చూసుకోవాలి.

కిచెన్​లో వద్దు:వంటగదిలో అద్దాలను ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా గ్యాస్ స్టవ్ లేదా వంట చేసే ప్రదేశాన్ని రిఫ్లెక్ట్​ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

స్టడీ టేబుల్​కు దూరంగా:అద్దాలను స్టడీ టేబుళ్లకు దూరంగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. దూరంగా ఉంచకపోతే మీ ఏకాగ్రతపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని.. దీంతో పని భారం కూడా డబుల్​ అయ్యే అవకాశం ఉంటుందంటున్నారు.

'మంగళ'వారం కొత్త పనులకు చాలా మంచిది- ఈ దేవతను పూజిస్తే శుభఫలితాలు మీ సొంతం - tuesday importance in hinduism

అద్దం ఫ్రేమ్​:చాలా మంది అద్దాలను రకరకాల డిజైన్లతో రకరకాల మెటల్స్​తో తయారు చేయించుకుంటారు. అయితే అలా ఎప్పుడు చేయొద్దని అంటున్నారు. మిర్రర్​ ఫ్రేమ్​ ఎప్పుడూ చెక్కతో చేసినదై ఉండాలని అంటున్నారు. మెటల్​ ఫ్రేమ్​తో చేసిన అద్దం ఉపయోగించకూడదని అంటున్నారు. అలాగే అద్దాలను ఉపయోగించడమే కాకుండా వాటిని ప్రతిరోజు క్లీన్​ చేయడం కూడా ముఖ్యమే అంటున్నారు నిపుణులు.

మీరు ఏదైనా బిజినెస్​ చేస్తే.. క్యాష్​ పెట్టే ప్రదేశంలో లాకర్​కు ఎదురుగా అద్దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దీంతో మీరు ఫైనాన్షియల్​గా డబుల్​ లాభం పొందుతారని అంటున్నారు. అంతేకాకుండా అద్దాన్ని లాక్​ర్​ లోపల కూడా పెట్టుకోవచ్చుంటున్నారు.

మీకు దుస్తులు, ఆభరణాలు లేదా వాచ్ దుకాణం ఉంటే, అలాగే దుకాణాన్ని పెద్దగా చేసినప్పుడు ఆ ప్రదేశంలో అద్దాన్ని పెట్టకుండా చూసుకోవాలని అంటున్నారు. ఇలా పెడితే ప్రతికూల శక్తికి దారితీస్తుందని అంటున్నారు.

మీరు పని చేసే ప్రదేశంలో అద్దాన్ని వాటర్ ఎలిమెంట్స్ ఉన్న ప్రాంతంలోనే ఏర్పాటు చేసుకోవాలని.. అది కూడా వాయువ్య, ఈశాన్యదిశలోనే ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Note :పైన తెలిపిన వివరాలు కొందరు వాస్తు నిపుణులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

తులసి మాలను ఏ స్వామి భక్తులు ధరిస్తారు? - ఎంతటి పుణ్యం లభిస్తుందో తెలుసా? - Tulsi Mala Benefits

శివయ్యను సోమవారం ఇలా పూజిస్తే మీ బాధలన్నీ క్లియర్​! కానీ నియమాలు పాటిస్తేనే!! - Monday Shiv Puja Vidhi

శనివారానికి వెంకటేశ్వరస్వామికి సంబంధమేంటి? ఎందుకు ఆరోజే పూజ చేయాలి? - Venkateswara Swamy Puja Saturday

Last Updated : Apr 30, 2024, 12:28 PM IST

ABOUT THE AUTHOR

...view details