తెలంగాణ

telangana

అప్పులతో అవస్థలు పడుతున్నారా? - వాస్తు ప్రకారం ఇలా చేస్తే అన్నీ తీరిపోతాయట! - Vastu Tips to Attract Money

By ETV Bharat Telugu Team

Published : May 10, 2024, 3:54 PM IST

Vastu Tips to Attract Wealth : ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ నిలవడం లేదా? డబ్బులు మంచి నీళ్లలా ఖర్చుయిపోతున్నాయా? అప్పులతో అవస్థలు పడుతున్నారా? అయితే.. ఇందుకు వాస్తు దోషం కూడా కారణం కావొచ్చంటున్నారు నిపుణులు!

Vastu Tips to Attract Money
VASTU TIPS FOR MONEY (ETV Bharat)

Vastu Tips to Attract Money : జీవితం అప్పుల్లో మునిగిపోతోందని లోలోపల మనోవేదనకు గురయ్యేవారు మన చుట్టూ ఎంతో మంది ఉంటారు. ఈ పరిస్థితికి వాస్తు (Vastu) కూడా కారణం కావొచ్చని వాస్తుశాస్త్ర పండితులు చెబుతున్నారు. ఈ సమస్యకు పరిష్కార మార్గాలు కూడా సూచిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అద్దం :మీరు ఆర్థిక సమస్యలతో ఇబ్బందిపడడానికి ఇంట్లో అద్దాన్ని వాస్తుప్రకారం అమర్చకపోవడం కూడా ఒక కారణం కావొచ్చంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. వాస్తు ప్రకారం మీ ఇంట్లో లేదా దుకాణంలో అద్దం ఈశాన్య దిశలో అమర్చుకోవాలట. ఇలా ఉంచడం వల్ల రుణ సమస్యల నుంచి విముక్తి కలుగుతుందంటున్నారు. అలాగే మీకు ఏదైనా అప్పు ఉంటే వాస్తుప్రకారం మంగళవారం చెల్లించడం మంచిదట. ఆ రోజు చెల్లించడం వల్ల అప్పులు త్వరగా తగ్గుతాయని చెబుతున్నారు.

లాకర్ : ధన ప్రాప్తి కలగాలన్నా, అప్పుల బాధ నుంచి విముక్తి పొందాలన్నా.. ఇంట్లోని మనీ లాకర్​ సరైన దిశలో ఉండడం చాలా ముఖ్యమంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. వాస్తుప్రకారం.. మనీ లాకర్ ఎప్పుడూ ఉత్తర దిశలో ఉండేలా చూసుకోవాలట. ఎందుకంటే ఈ దిశను కుబేరుడు పరిపాలించే దిశగా చెప్పుకుంటారు. కాబట్టి వాస్తు ప్రకారం.. లాకర్, ఇంట్లో బీరువా తలుపులు ఉత్తరం వైపు తెరుచుకునేలా అమర్చుకోవడం వల్ల సంపద పెరిగి అప్పులు బాధ ఉండదని వాస్తు పండితులు సూచిస్తున్నారు.

లక్ష్మీదేవి, కుబేర విగ్రహాలు :మీరు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే లక్ష్మీదేవి, కుబేరుల విగ్రహాలను వాస్తుప్రకారం ఉత్తర దిశలో ఉంచి పూజించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చంటున్నారు. ఇలా చేయడం వల్ల రుణ సమస్యలు ఉంటే వాటి నుంచి త్వరలోనే విముక్తి లభిస్తుందంటున్నారు. ఇక ఇదే టైమ్​లో లైఫ్​లో పురోగతిని సాధించాలంటే, సంపాదించిన ధనం నిలబడాలంటే ఈశాన్య దిశను శుభ్రంగా ఉంచాలని చెబుతున్నారు.

లక్ష్మీదేవికి 108 రూపాయి నాణేలతో పూజ- శుక్రవారం రోజు మహిళలు ఇలా చేస్తే కనక వర్షమే!

తలుపులు, కిటికీల దిశ :రుణ సమస్యలు పెరగడానికి ఇంటి తలుపులు, కిటికీలు సరైన దిశలో ఉండకపోవడం కూడా ఒక కారణం కావొచ్చంటున్నారు వాస్తు పండితులు. ముఖ్యంగా వాస్తుప్రకారం.. బెడ్​రూమ్​కి వాయువ్య లేదా నైరుతి దిశలో తలుపులు లేదా కిటీకీలు ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇలా ఉండడం ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశించి ఆర్థిక సమస్యలు పెరిగేలా చేస్తుందట.

బాత్​రూమ్ దిశ :వాస్తు ప్రకారం బాత్​రూమ్ ఎప్పుడూ నైరుతి దిశలో ఉండకుండా చూసుకోవాలట. అలా ఉండడం వల్ల ఆర్థిక సమస్యలు పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. అలాగే.. వాస్తుప్రకారం ఇల్లు లేదా షాప్ గోడ ముదురు నీలం రంగులో ఉండకూడదట. ఇది అప్పుల్లో కూరుకుపోవడానికి కారణం కావొచ్చట. వాస్తుప్రకారం ఇంట్లో లేత రంగు పెయింట్స్ ఉపయోగించడం మంచిదట.

నిద్రించే దిశ :మీరు అప్పుల్లో ఉంటే.. నిద్ర స్థానాన్ని మార్చుకోవడం ద్వారా ఆ సమస్య నుంచి విముక్తి పొందే అవకాశం ఉంటుందంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. అప్పుల్లో ఉన్న వ్యక్తి ఎప్పుడూ నైరుతి దిశలో ఉన్న గదిలో నిద్రించాలట.

తులసి పూజ : వాస్తు ప్రకారం రోజూ తులసి మొక్కకు నీరు పోయడం, సాయంత్రం తులసి ప్లాంట్ కింద నెయ్యితో దీపం వెలిగించడం వల్ల కూడా ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయట. డైలీ ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివిటీ పెరిగి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు.

Note : పైన తెలిపిన వివరాలు కొందరు వాస్తు నిపుణులు, వాస్తు శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

వాస్తుప్రకారం మనీ ప్లాంట్​కు ఈ వస్తువు కడితే - ఆర్థిక సమస్యలన్నీ పరార్​! - Vastu Tips for Money Plant

ABOUT THE AUTHOR

...view details